A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వరుణ్ గాందీ అలా లేఖ రాస్తే కోపం వచ్చింది
Share |
December 12 2018, 9:48 am

బిజెపి ఎమ్.పి, ఇందిరాగాందీ మనుమడు వరుణ్ గాందీ ఒక ఆదర్శాన్ని పాటిస్తున్నారు. ఆయన గత తొమ్మిదేళ్లుగా సుల్తాన్‌పూర్‌ ఎంపీ వరుణ్‌ గాంధీ తన వేతనాన్ని విరాళంగా ఇచ్చేస్తూ ఒక్క పైసా కూడా తీసుకోవడం లేదు.తనలాగానే సంపన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ జీతాలను వదులుకోవాలని తాను చేసిన విజ్ఞప్తిని ఏ ఒక్కరూ పట్టించుకోలేదని ఆయన అంటున్నారు. 25 కోట్లు మించి ఆస్తులను ప్రకటించిన ఎంపీలు, ఎమ్మెల్యేలందరికి తాను లేఖలు రాశానని, చట్ట సభ సభ్యుడిగా మీకు వచ్చే వేతనాలను మీరు ఎందుకు వదిలివేయకూడదని తాను కోరానని ఆయన తెలిపారు. మనం ఇలా చేస్తే ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ 480 కోట్లు మిగులుతాయని ఇది పెద్ద మొత్తమేనని వారికి వివరించానన్నారు. ఇలాంటి లేఖలు రాసినందుకు ఆయనపై కొందరు ఎమ్.పిలు ఆగ్రహం వ్యక్తం చేశారట.

tags : varun, letter

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info