A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి నుంచి యుసిలు రాలేదన్న మంత్రి
Share |
October 16 2018, 11:18 am

ఎపి ప్రభుత్వం వివిధ శాఖలలో కేంద్రం నుంచి వచ్చిన నిదుల వినియోగానికి సంబందించి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్న విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు పీజీ కోర్సులు ప్రవేశపెట్టి, పీజీ కోర్సులలో సీట్లు పెంచడానికి వీలుగా కాలేజీలను పటిష్ట పరచి, అప్‌గ్రేడ్‌ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ పథకం కింద ఆర్థిక సాయం చేస్తుంది. కాని కేంద్రం ఇచ్చిన నిదులకు ఎపి ప్రభుత్వం నుంచి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు రాలేదని కంంద్ర మంత్రిచౌబే రాజ్యసభలో తెలిపారు. ఆంధ్రా మెడికల్‌ కాలేజీ-విశాఖపట్నం, గుంటూరు మెడికల్‌ కాలేజీ, సిద్ధార్ధ మెడికల్‌ కాలేజీ-విజయవాడ, రంగరాయ మెడికల్‌ కాలేజీ-కాకినాడ, కర్నూలు మెడికల్‌ కాలేజీ, ఎస్వీ మెడికల్‌ కాలేజీ-తిరుపతి, గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీ-అనంతపురం ఎంపికైన కాలేజీలలో ఉన్నట్లుగా మంత్రి వెల్లడించారు. 2016-17, 2018-19 సంవత్సరాలకు గాను రాష్ట్రంలోని ఏడు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో మౌలిక వసతులను పటిష్ట పరచి అప్‌గ్రేడ్‌ చేసేందుకు కేంద్ర సాయం కింద రెండేళ్లలో మొత్తం 81 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసినట్లు మంత్రి చెప్పారు. జీఎఫ్‌ఆర్‌ నిబంధన ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ నిధులకు సంబంధించి వినియోగ ధృవ పత్రాలను సమర్పించిన తర్వాత మాత్రమే తదుపరి నిధుల విడుదల సాధ్యపడుతుందని ఆయన చెప్పారు.

tags : uc, ap

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info