A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కరుణానిధి అంత్యక్రియలు ఎక్కడో తేలలేదు
Share |
October 19 2018, 11:58 pm

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ,డిఎమ్.కె అదినేత కరుణానిది అంత్యక్రియలు ఎక్కడ జరపాలన్నది ఇంకా నిర్దారణ కాలేదు. మెరీనా బీచ్ తీరంలోనే జరగాలని కోరుతూ డి.ఎమ్.కె. హైకోర్టును హడావుడిగా ఆశ్రయించింది. అయితే అక్కడ వాదోపవాదాలు విన్న ప్రదాన న్యాయమూర్తి పిటిషన్ విచారణను ఈ ఉదయం ఎనిమిది గంటలకు వాయిదా వేశారు. మెరీనా బీచ్‌లో స్మారకానికి న్యాయపరమైన చిక్కులున్నాయని అందువల్ల ఎట్టిపరిస్థితుల్లోనూ అక్కడ అనుమతి ఇవ్వలేమని ప్రభుత్వం చెబుతోంది.పటేల్ రోడ్డులో రెండు ఎకరాల స్థలం కేటాయిస్తామని తెలిపింది. కాగా మెరీనాలోనే కరుణానిధి అంత్యక్రియలు జరపాలంటూ సినీనటుడు రజనీకాంత్, కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ సహా పలువురు డిమాండ్‌ చేశారు. అన్నా సమాధి వద్ద కరుణానిధి సమాధి ఏర్పాటుకు అవకాశం ఉందని, అయితే, తాము వేసి ఉన్న కేసుల్ని సాకుగా చూపించి, స్థలం కేటాయించకుండా ప్రభుత్వం నిరాకరించడాన్ని ఖండిస్తున్నామని జయ స్మారకం నిర్మాణంపై కేసు వేసిన న్యాయవాదులు బాలు, దురైస్వామిలు పేర్కొన్నారు

tags : karuna,funeral

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info