A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇప్పుడే నిద్రలేచి నట్లు టిడిపి నాటకాలు
Share |
October 18 2018, 7:54 am

తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నిద్ర లేచి ప్రత్యేక హోదా అంటూ నాటకాలు ఆడుతోందని ప్రత్యేక హోదాపై రాజీనామా చేసిన రాజంపేట వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పి మిదున్ రెడ్డి అన్నారు.
ప్రధాని మోదీ ఉచ్చు, ట్రాప్‌ అంటూ శ్రతువులన్నట్లుగా మాట్లాడారు. కానీ గత సమావేశాల్లో మేం 13సార్లు అవిశ్వాసం పెట్టినా చర్చకు అనుమతి ఇవ్వకుండా బీజేపీ పారిపోయింది. మరోవైపు ఆనాడు చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుని హోదా ఉద్యమాన్ని నీరు గార్చేందుకు యత్నించారు. పార్లమెంట్లో ఏం మాట్లాడినా ప్రయోజనం లేదనే విషయం మాకు తెలిసింది. నాలుగేళ్ల నుంచి పార్లమెంట్‌లో మేం హోదాపై మాట్లాడుతున్నామని, ఇప్పుడు నిద్రలేచి టీడీపీ హోదా అని నాటకాలు ఆడుతోంది. మేం మాత్రం ఎంపీ పదవులకు రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచి.. ప్రత్యేక హోదా సాధించడానికి ప్రయత్నించాం. మేం రాజీనామాలు చేశామన్న కోపం ప్రధాని మోదీ మాటల్లో కనిపించింది. అని మిదున్ రెడ్డి వ్యాఖ్యానించారు.

tags : midhunreddy, comments

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info