A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెటిఆర్ నోట బూతు మాట!
Share |
October 18 2018, 8:09 am

తెలంగాణ మంత్రి కెటిఆర్ మంచి భాష వాడతారని, పవర్ ఫుల్ స్పీచ్ ఇస్తారని పేరు. ఆయన అభ్యంతరకర పదాలు తక్కువగా వాడతారని అంటారు. అలాంటి ఆయన ఒక అదికారిక మీటింగ్ లో బూతులు మాట్లాడారట. బతకమ్మ చీరెల సేకరణకు సంబందించి జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నప్పుడు ఈ ఘటన జరిగింది. మొత్తం అరవై లక్షల చీరలకు గాను ముప్పై లక్షలే సిద్దంగా ఉన్నాయని అదికారులు వివరించగా ఆయన అసహనానికి గురి అయ్యారు. గతసారి చీరల కొరత వస్తే సూరత్ నుంచి తీసుకు రావల్సి వచ్చిందని, కాని అప్పుడు వాటి నాణ్యతపై విమర్వలు వచ్చాయని అంటూ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పిచ్చి కుంటల ...అంటూ ఒక అభ్యంతరకర బూతు పదం వాడి..150 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారని కెటిఆర్ వ్యాఖ్యానించారట. మహిళా అదికారులతో సహా పలువురు సీనియర్ అదికారులు ఉన్న సమావేశంలో కెటిఆర్ ఇలా అనడం అందరూ ఆశ్చర్యపోయారట. దీనికి సంబందించి వీడియో సోషల్ మీడియాలో ప్రచారం అవుతోందట.

tags : ktr, slang

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info