A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బోర్డు తిప్పేయడంలో చంద్రబాబు నిపుణుడు
Share |
August 22 2018, 1:20 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బోర్డు తిప్పడం లో నిపుణుడని కడప వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అంజాద్ భాషా వ్యాఖ్యానించారు. విపక్ష నేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ ఇచ్చిన బంద్ ను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబు కారణమని, ఆయనే ప్యాకేజీ ఇవ్వాలని కోరడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని భాషా అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే అభివృద్ది జరుగుతదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌ పోరాటాల వల్లే హోదా అంశం సజీవంగా ఉందని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్‌లో టీడీపీ ఆడిన డ్రామాలన్నీ ప్రజలు గమనించారని వివరించారు. నిన్నటి వరకు ప్యాకేజీ అన్న బాబు నేడు హోదా అంటూ బోర్డు తిప్పేశారని ఎద్దేవ చేశారు. చంద్రబాబుకు ప్రజలను మోసం చేయడం మాత్రమే తెలుసని అంజద్‌ బాషా అన్నారు.

tags : amzad bhasha, chadnrababu, board

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info