A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీపై తీవ్ర ఆరోపణ చేసిన రాహుల్ గాందీ
Share |
August 22 2018, 1:21 am

కొందరు వ్యాపార ప్రముఖులతో ప్రదాని మోడీకి ఉన్న సంబందాలు అందరికి తెలుసునని ఎఐసిసి అద్యక్షుడు రాహుల్ గాందీ ఆరోపించారు. కొందరు వ్యాపారులకు అనుకూలంగా మోడీ ప్రచారం చేస్తుంటారని, ఆయన వారికి కాంట్రాక్టులు వచ్చేలా చేస్తున్నారని రాహుల్ అన్నారు. తద్వారా వారు లాభపడుతున్నారని, ఒక వ్యాపార వేత్త నలభైఐదువేల కోట్ల రూపాయల లాభం పొందరని, హెచ్ ఎ ఎల్ నుంచి కాంట్రాక్టు ను తీసేసుకున్నారని, దానికి మోడీ జవాబు చెప్పాలని ఆయన అన్నారు. మోడీ నవ్వుతున్నారని,కాని చాలా అసహనంతో ఉన్నారని, తనకు ఆ విషయం అర్దం అవుతుందని అన్నారు. తన కళ్లలోకి మోడీ చూడలేరని ఆయన అన్నారు.రఫేల్ విమానాల విషయంలో రక్షణ మంత్రి అసత్యాలు చెబుతున్నారని ఆయన అన్నారు.రాహుల్ స్పీచ్ పై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్ అబ్యంతరం చెబుతూ నోటీసు ఇవ్వకుండా ఇష్టం వచ్చిన ఆరోపణలు చేయరాదని అన్నారు. రాహుల్ కుటుంబానికి రాజ్యాంగంపై ,నిబంధనలపై గౌరవం లేదని ఆయన అన్నారు.రాహుల్ గాందీ తన ప్రసంగం కొనసాగిస్తూ పది మంది వ్యాపారులకు మాత్రమే లాభం చేకూర్చుతున్నారని అన్నారు.

tags : rahul, modi

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info