A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపిలో గుబులు ఏర్పడిందా
Share |
December 14 2018, 12:16 pm

రాజకీయం ఎప్పుడు ఎటు అయినా మలుపు తిరగవచ్చు. కేంద్రంలో అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తున్న తీరు ఇందుకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది.గత లోక్ సభ సమావేశాలలో ఇదే అంశంపై ఎపికి చెందిన వైఎస్ ఆర్ కాంగ్రెస్ , టిడిపిలు వరసగా అవిశ్వాస తీర్మానాలు ఇచ్చినా, చర్చకు రాని పరిస్థితి నుంచి ఇప్పుడు మొదటి రోజే అవిశ్వాస తీర్మానం చర్చకు రావడం గమనించదగ్గ పరిణామమే. టిడిపి అవిశ్వాస తీర్మానం నోటీసుతో పాటు కాంగ్రెస్,ఇతర పక్షాలు కూడా నోటీసులు ఇచ్చాయి.బిజెపి వారు తెలుగుదేశం పార్టీతో రహస్య సంబందాలు పెట్టుకున్నారా?లేదా అన్న విషయాలు పక్కన పెడితే వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పిలు తమ నిర్ణయం ప్రకారం ,నిబద్దతతో రాజీనామా లు చేసిన తర్వాత ఈ అవిశ్వాస తీర్మానం చర్చకు రావడం విశేషంగానే కనిపిస్తుంది. కాని రాజకీయాలు ఎప్పటికప్పుడు మారిపోతాయి. నిజానికి గతసారి మాదిరే బిజెపి ఇప్పుడు కూడా అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా అడ్డుపడవచ్చని తెలుగుదేశం భావించినట్లు కనిపిస్తుంది. అందుకే యదా ప్రకారం డ్రామా నడపవచ్చని యోచన చేసింది.కాని సడన్ గా బిజెపి అవిశ్వాస తీర్మానం అనుమతి ఇవ్వడంతో తెలుగుదేశంలో కొత్త గుబులు పుట్టిందన్న అబిప్రాయం ఏర్పడుతోంది.అంతకు ముందు ఉన్న జోష్ ఇప్పుడు టిడిపిలో కనిపించడం లేదు.నిజంగానే కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి, అవకాశం వస్తే మోడీ ప్రభుత్వాన్ని కూల్చడానికి సిద్దపడదలిస్తే తెలుగుదేశం అదినేత, ముఖ్యమంత్రి చందబాబు నాయుడు స్వయంగా డిల్లీ వెళ్లి ఇప్పుడు హడావుడి చేసేవారని కొందరు విశ్లేషణకులు వ్యాఖ్యానిస్తున్నారు. అలా కాకుండా మంత్రి యనమలను,కొందరు అదికారులను డిల్లీకి పంపించి ఎమ్.పిలకు ఇప్పుడు బ్రీఫ్ ఇప్పించే పనిలో పడ్డారంటే ఈ పరిణామ క్రమాన్ని చంద్రబాబు ఊహించలేకపోయారు. తాము ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చింని సంతోషించాలో, లేదో తెలియని అయోమయంలో పడ్డారు. పార్లమెంటులో బిజెపి ఎమ్.పిలు కాని, మంత్రులు కాని, ప్రదాని మోడీ కాని ఎలాంటి బాంబులు తమపై వేస్తారో తెలియక ఆందోళనకు గురి అవుతున్నారన్న అబిప్రాయం కూడా ఉంది.ఇక కాంగ్రెస్ పార్టీ అదినేత్రి సోనియాగాందీ తో సహా అంతా తమకు అనుకూలంగా నిలబడ్డారని గట్టిగా చెప్పుకోలేపోతున్నారు. ఒక వైపు బిజెపితో రహస్య బందం కొనసాగుతోందని ఆరోపణ, మరో వైపు ఇంతకాలం తాము తీవ్రంగా దూషించిన కాంగ్రెస్ తో, సోనియాగాందీతో చెట్టపట్టాలు వేసుకున్నట్లు సంకేతం వెళితే వచ్చే సమస్యలపై టిడిపి నేతలు సతమతమవుతున్నారు.అదే సమయంలో కాంగ్రెస్ వారు కూడా ఇదేమిటి టిడిపికి తోకగా తాము నిలబడినట్లయింది..తాము వేరే అవిశ్వాస నోటీసు ఇచ్చామని చెప్పుకోవడానికి తంటాలు పడుతున్నారు.ఈ గందరగోళం ఇలా ఉంటే అనంతపురం టిడిపి ఎమ్.పి జెసి దివాకరరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును అదను చూసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. విప్ ఇచ్చినా లోక్ సభకు వెళ్లనని ప్రకటించడం ద్వారా టిడిపి అవిశ్వాస తీర్మానానికి విశ్వసనీయం పోయినట్లయింది.కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి తమ ఉద్దేశం ప్రబుత్వాన్ని పడగొట్టడం కాదని చెప్పడం ద్వారా బిజెపిని ఇబ్బంది పెట్టం అని పరోక్షంగా చెబుతున్నారు.అదే సమయంలో కాంగ్రెస్ నేత సోనియాగాందీ తాము ప్రభుత్వాన్ని పడగొడతామని అంటున్నారు.ఈ పరిణామాల నేపద్యంలో తెలుగుదేశం మీడియా మళ్లీ యుద్దం చేయబోతున్నట్లు ప్రచారం ఆరంబించింది.మీడియా ప్రచారం ఏమో కాని పార్లమెంటులో తమ గుట్టు మట్లన్ని బిజెపి బయటపెడుతుందోమోనని, అలాగే చంద్రబాబు ఎన్నిసార్లు ఎన్ని మాటలు మార్చింది తేటతెల్లంగా చెప్పడం ద్వారా జాతీయ స్థాయిలో అప్రతిష్ట కలిగిస్తారేమోనన్న చింత టిడిపి నాయకత్వానికి ఉండే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఏది ఏమైనా అవిశ్వాస తీర్మానం చివరికి టిడిపికి ఎలాంటి సంకటం తెస్తుందన్నదే ఎపి రాజకీయాలకు సంబందించిన కీలక అంశం అవుతుంది.

tags : tdp, no confidence

Latest News
*7 గురు కొత్త ఎమ్మెల్యేలపై హత్యాయత్నం కేసులు
*చంద్రబాబు జోక్యం-సిపిఎం విశ్లేషణ
*ఎపిలో కెసిఆర్ ప్లెక్సీని పెట్టనివ్వరా
*ఎమ్.పిలందరికి మళ్లీ టిక్కెట్లు- కెసిఆర్
*కెసిఆర్ కు తాడు ,బొంగరం లేదట
*ఉత్తం సవాల్ మరిచారా
*కాంగ్రెస్ అబద్దపు హామీలు ఇచ్చింది
*టి.అసెంబ్లీలో 24 మంది కొత్త వారు
*కారు బదులు ట్రక్- ఓడిన నేతలు
*కాంగ్రెస్ కు ఓట్లు పెరిగాయి..సీట్లు తగ్గాయి
*ప్రతిపక్ష నేత హోదా కోసం కాంగ్రెస్ లో పోటీ
*రఫెల్ డీల్-బిజెపికి ఊరట-కాంగ్రెస్ కు దెబ్బ
*కెసిఆర్ కు ఎపి టిడిపి గట్టి వార్నింగ్ ఇస్తోందా
*ముస్లింలలో చీలిక తేవడానికి బాబు యత్నం
*మళ్లీ తారా చౌదరి వార్తలలోకి వచ్చారు
*నాయిని మంత్రి అవుతారా?ఏ శాఖ ఇస్తారో
*ఎపిలో ఇళ్ల నిర్మాణానికి 14వేల కోట్లు -కేంద్రం
*అదికారంకోసం అర్రులు చాచం-భట్టి
*నటులకు ఓట్లు రాలవన్న ప్రముఖ నటి
*ఇండిపెండెంట్లను ముంచిన లగడపాటి
*లోక్ సభ ఎన్నికలకూ కూటమి ఉండాలన్న నేత
*కాంగ్రెస్,టిడిపి సమన్వయంగా పనిచేయలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info