A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జెసి వెళుతున్నారు..రాజీనామా అంటున్నారు
Share |
October 18 2018, 8:40 am

తన డిమాండ్ల సాదనలో కొంతవరకు సఫలం అయిన అనంతపురం టిడిపి ఎమ్.పి జెసి దివాకరరెడ్డి ఇప్పుడు పార్లమెంటు సమావేశానికి హాజరు అవుతానని అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పోన్ చేశారని,ఆయన విజ్ఞప్తి మేరకు పార్లమెంటుకు వెళుతున్నానని ఆయన చెప్పారు.విప్ జారీ చేసినా లోక్ సభకు హాజరు కానని చెప్పిన దివాకరరెడ్డి రేపు ఢిల్లీ వెళ్లి పార్లమెంట్‌ సమావేశాలకు హాజరవుతానని, అవిశ్వాస తీర్మానం చర్చలో పాల్గొంటానని తెలిపారు. తాను బెదిరింపు రాజకీయాలకు పాల్పడటం లేదని ఆయన అన్నారని కదనం. బ్లాక్‌మెయిల్ పాలిటిక్స్ చేస్తున్నారన్న ఓ మీడియా ప్రతినిధిని ‘గేటవుట్’ అంటూ కసిరారని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే అదే సమయంలో ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్టు వెల్లడించారు. రాజీనామాపై తన నిర్ణయాన్ని శుక్రవారం సాయంత్రం తర్వాత ప్రకటిస్తానని ఆయన చెప్పడం విశేషం.

tags : jc, lok sabha

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info