A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దివాకరరెడ్డి బెదిరింపు పనిచేసిందా
Share |
October 18 2018, 8:41 am

పార్లమెంటుకు వెళ్లనంటూ బెదిరించిన ఎమ్.పి జెసి దివాకరరెడ్డి దెబ్బకు తెలుగుదేశం పార్టీ అదిష్టానమే దిగి వచ్చిందని వార్తలు వస్తున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలో దిగి జెసిని బుజ్జగించే యత్నం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా జెసి రాజకీయ ప్రత్యర్దిగా ఉన్న అనంతపురం టిడిపి ఎమ్మెల్యే ప్రబాకర చౌదరిని పిలిపించుకుని మాట్లాడారు. జెసితో సర్దుకుపోవాలని చెప్పడం విశేషం. సీఎం రమ్మన్నందుకే వచ్చి ఆయనను కలిసినట్లు వివరించారు. జేసీ దివాకర్‌రెడ్డితో వివాదాలు ఉంటే సర్దుకుపోవాలని చంద్రబాబు తనకు సూచించినట్లు ప్రభాకర్‌ చౌదరి చెప్పారు.జేసీ దివాకర్‌రెడ్డితో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని, కేవలం రాజకీయంగా మాత్రమే విభేదాలున్నాయని చంద్రబాబుకు వివరించగా.. ఇద్దరూ కలిసి పనిచేయడంపై దృష్టిసారించాలని చెప్పారని ఆయన అన్నారు. పార్లమెంట్‌ సభ్యుడి గా ఆయన పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించే అధికారం జేసీ దివాకర్‌రెడ్డికి ఉందన్నారు. అదే విధంగా తన నియోజకవర్గ అభివృద్ధి కూడా తనకు ముఖ్యమేనని ఎమ్మెల్యే అన్నారు.

tags : jc , blackmail

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info