A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పంక్చర్ షాప్- వంద కోట్లు సంపాదించాడా
Share |
January 22 2019, 4:05 am

తిరుపతిలో పంక్చర్ షాపు నడిపిన ఒక వ్యక్తి ఏకంగా వంద కోట్ల రూపాయల ఆస్తి కూడెబెట్టాడంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. కాని ఇది నిజం.అతను పైకి పంక్చర్ షాపు నడిపినా, అసలు చేసింది వడ్డీ వ్యాపారమట. తిరుపతికి చెందిన కందిశెట్టి రమేష్‌.. ఇరవై ఏళ్ల కిందట సైకిళ్లకు పంక్చర్లు వేసుకునే చిన్న దుకాణం ప్రారంభించి రోజుకు 50 రూపాయలు సంపాదించుకునేవాడట. ఆ తర్వాత వడ్డీ వ్యాపారంలోకి వచ్చి అనేక మందిని ఆకర్షించాడు.పెద్ద ఎత్తున అప్పులు ఇచ్చే దశకు ఎదిగాడు. వడ్డీ వసూలు చేయడంలో దిట్టగా పేరొందాడు.అవసరమైతే భౌతిక దాడులు కూడా చేయించేవాడట. ఎవరో పిర్యాదు చేస్తే ఐటి శాఖ అదికారుల దృష్టికి వెళ్లింది.వారు దాడులు చేస్తే అతని వద్ద దొరికిన ఆస్తి విలువ వంద కోట్లపై మాటేనని తేల్చారట.

tags : ap, it, puncture shop, hundred crores

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info