A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నటుడిగా కన్నా స్మగ్లర్ గానే రాణించాడా
Share |
November 18 2018, 5:58 am

నట జీవితం కన్నా ఎర్ర చందనం స్మగ్లింగ్ బెటర్ అనుకున్నట్లుగా ఉంది.ఒక మామూలు కారక్టర్ నటుడు ఒకతను ఈ అక్రమ దందాలో ఈమద్యకాలంలో ఐదు కోట్ల రూపాయలు సంపాదించాడట. అంతేకాక తన సహ నటుడు నటించిన ఒక సినిమాకు పెట్టుబడి కూడా పెట్టాడట.ప్రస్తుతం ఈ స్మగ్లర్ కోసం పోలీసులు వేట సాగిస్తున్నారట.తిరుపతికి చెందిన ఈ వ్యక్తి టీవీ సీరియళ్లతో పాటు జబర్దస్త లో కూడా నటించాడట.ఇదే సమయంలో కొందరు బడా స్మగ్లర్ లతో సంబందాలు పెట్టుకుని దీనిని వ్యాపారంగా చేసుకున్నాడు. ప్రస్తుతం ఇతనిపై ఇరవై కేసులు నమోదు అయ్యాయి. ఇతనితో పాటు మరి కొందరు విద్యార్థులు, చిన్న చిన్న డాక్టర్లు, ఇంజినీర్లు, ప్రైవేటు ఉద్యోగులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడితో పాటు అనుచరుల కోసం గాలిస్తున్నట్లు టాస్క్‌పోర్స్‌ అధికారులు తెలిపారు. ఈ కేసులో మరో ఇద్దరు ఆర్టిస్టులు కూడా ఉన్నారని టాస్కో పోర్స్ వారు చెబుతున్నారు.

tags : ap, red sandle, actor,smuggler

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info