A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కిరణ్ కాంగ్రెస్ లో చేరిక
Share |
February 19 2019, 1:54 pm

శుక్రవారం పదకొండుగంటలకు రాహుల్ గాంధీ సమక్షంలో ఎపి మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి చేరిక. ఈ భేటీలో ఎపి ఇంఛార్జి ఉమెన్ ఛాందీ, రఘువీరా రెడ్డి, మెయ్యప్పన్, క్రిష్టోఫర్ ఉన్నారు.కిరణ్ కుమార్ రెడ్డి జాతీయరాజకీయాల్లో కీలకంగా మారబోతున్నారని సమాచారం. ఎపిలో ఇప్పటికిప్పుడే పార్టీని ఏం చేయలేని పరిస్థితుల్లో ఉందని, తాను కర్నాటక, తెలంగాణ, మహారాష్ట్రల్లో సేవలందించందుకు సిద్దంగా ఉన్నానని రాహుల్ గాంధీ ఇంతకుముందే జరిగిన భేటీలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అందుకే తెలంగాణకు ఒకవేళ ముందస్తు వస్తే కిరణ్ కుమార్ రెడ్డి తెరవెనుక కీలకపాత్ర పోషించనున్నారని సమాచారం. అటు ఆర్థికపరంగా,వ్యూహాత్మకంగా సేవలందిస్తారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల తర్వాత రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశముందని తెలుస్తోంది.

tags : ex cm,kiran,rahul

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info