A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విపక్ష ఎమ్మెల్యేలకే ఉద్యోగ సంఘాల నిరసనా
Share |
April 20 2019, 7:41 pm

ఎపిలో ఉద్యోగ సంఘాల తీరు తమాషాగానే ఉంటోంది. అదికార పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైనా ఏమని దూషించినా పట్టించుకోని ఉద్యోగ సంఘాల నేతలు విపక్ష ఎమ్మెల్యే ఏదైనా అంటే మాత్రం పెద్ద ఎత్తున నరిసనలకు దిగుతుంటాయి. అయితే ఎవరైనా అభ్యంతరకరంగా మాట్లాడరాదు. నెల్లూరు జిల్లా కలెక్టర్ పట్ల వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాకాణి గోవర్దనరెడ్డి దురుసుగా మాట్లాడారంటూ జిల్లాలో ఉద్యోగ సంఘాలు నిరసనకు దిగాయి.ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి.కలెక్టర్ ను ఉద్దేశించి ఖబడ్దార్ అన్నారని, తనను చూసి పారిపోయారని అన్నారన్నది ఉద్యోగ సంఘాల అబియోగం. అయితే తాను అలా అనలేదని,రుజువు చూపిస్తే, బహిరంగ క్షమాపణకు సిద్దమని కాకాణి అంటున్నారుగత రెండు రోజులగా ఉద్యోగ సంఘాల వారు నల్ల బాడ్జీలతో నిరసన తెలుపుతున్నారు.నిజంగానే గోవర్దనరెడ్డి అలా అని ఉంటే నిరసన చెప్పడం తప్పు కాదు. అయితే గతంలో టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముసునూరు ఎమ్మార్వోపై దౌర్జన్యం చేసినప్పుడు, రవాణా కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై టిడిపి ఎమ్.పి కేశినేని నాని,ఎమ్మెల్యే బొండా ఉమ లు దౌర్జన్యంగా వ్యవహరించినప్పుడు ఈ సంఘాల వారు నోరు విప్పడానికి భయపడ్డారు.ఇప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యే కనుక ,అధికారపార్టీ అండ ఉంటుంది కనుక ఉద్యోగ సంఘాలు నిరసనలు తెలుపుతున్నాయని అనుకోవచ్చా!ఎవరు అభ్యంతరకరంగా వ్యవహరించినా ఉద్యోగ సంఘాలు నిరసన చెప్పడం మంచిదే.కాకపోతే ఇందులో వివక్ష మంచిది కాదేమో!

tags : ap, ngos, kakani

Latest News
*చంద్రబాబు ఇవ్వాళ కూడా ఈ ట్వీట్ ఇవ్వాలా
*లక్ష్మీనారాయణకు మళ్లీ విజయసాయి కౌంటర్
*చంద్రబాబుకు ఈనాడు పొగడ్తల జల్లు
*లక్ష్మీనారాయణ వ్యాఖ్య- నిజంగా దర్మంగా చేశారా
*కర్నాటక ప్రజల చెవిలో చంద్రబా బు పూలు
*మోడీలో ఆ లక్షణాలు లేవంటున్న విజయశాంతి
*ముఖ్యమంత్రి పగటి కలలు కంటున్నారు
*ఈ ప్రభుత్వమే పోతుంది.. భయపడవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info