A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోలవరం-బిజెపి,టిడిపి డ్రామాలు ఆపాలి
Share |
January 22 2019, 4:04 am

పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం ఒక డెడ్ లైన్ ప్రకటించాలని వైఎస్ ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి పోలరవం పర్యటనలో ప్రాజెక్టులో జరుగుతున్న అక్రమాలు బహిర్గతం అయ్యాయని ఆయన అన్నారు.అయితే బిజెపి,టిడిపిలు కలిసి ఇక్కడ డ్రామాలు ఆడుతున్నాయని ఆయన ఆరోపించారు.పట్టిసీమ ప్రాజెక్టు కోసం పోలవరం ప్రాజెక్టును ప్రభుత్వం పక్కన బెట్టిందని ,ఈ ప్రాజెక్టులలో కమిషన్ లు దండుకోవడమే పనిగా చంద్రబాబు పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు.ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నించారు. డీపీఆర్‌లలో ఎందుకు వ్యత్యాసాలు వస్తున్నాయో ప్రజలకు చెప్పాలన్నారు.

tags : botsa, polavaram

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info