A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అందరికి సెల్ పోన్ లు వచ్చాయి కదా..ఎక్కడండి
Share |
January 22 2019, 3:17 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టే మీటింగ్ ల దుబారా ఖర్చుతో సెల్ పోన్ లు వచ్చేసేయేమో! చంద్రబాబు విజయవాడలో జరిగిన అంగన్ వాడీల సమావేశంలో ప్రసంగించారట.ఆ సందర్భంగా ఆయన వారికి ఒక ప్రశ్న వేశారు.ఎంతమందికి సెల్ పోన్ లు వచ్చాయో చెప్పాలని ,వారు చేతులు ఎత్తాలని అడిగారు. అయితే తమకు అసలు సెల్ పోన్ లే అందలేదని చెబుతూ చేతులు ఊపడంతో కంగు తినడం ముఖ్యమంత్రి వంతు అయిందట.దాంతో ఆయన ఆ నెపాన్ని అధికారుల మీద వేసి తప్పుకున్నారట.తనకు అదికారులు తప్పుడు సమాచారం ఇచ్చారని అన్నారట. ఆగస్టు పది హేను నాటికి అందరికి సెల్ పోన్ లు ఇస్తామని ఆయన ప్రకటించి సర్దుకున్నారు.గతంలో మహిళలందరికి సెల్ పోన్ లు ఇస్తామని ఎన్నికల సమయంలో టిడిపి ప్రచారం చేసింది.అంగన్ వాడీలకే పోన్ లు ఇవ్వకపోతే,మిగిలినవారికి ఎప్పటికి ఇస్తారో..

tags : ap, cell phones,

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info