A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హిందువులను బహిష్కరణ చేయడమే
Share |
November 18 2018, 8:52 am

హిందూ దేవతలను తూలనాడిన మజ్లిస్ నేతలను బహిష్కరించవలసింది పోయి, హిందూ మతాచార్యుడు పరిపూర్ణానంద స్వామి పై బహిష్కరణ వేటు వేయడం ఏమిటని బిజెపి తెలంగాణ అద్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ప్రశ్నించారు.ఆయనపై తీసుకున్న బహిష్కరణ చర్యపై పునరాలోచన చేయాలని లక్ష్మణ్ కోరారు. కోట్లాది ప్రజలు ఆరాధించే శ్రీరాముడిని నిందించిన వారిపై చర్యలేవని, ఈ ప్రభుత్వం ఎవరి చేతిలో నడుస్తోందని ప్రశ్నించారు. ఆయన నగర బహిష్కరణ ప్రభుత్వ కుట్రని అన్నారు. హిందూ దేవుళ్లను తూలనాడిన ఎమ్‌ఐఎమ్‌ నేతలను బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు. స్వామిజీని బహిష్కరణ చేయడమంటే హిందూవులను బహిష్కరణ చేయడమే అని మండిపడ్డారు. పరిపూర్ణానందపై కేసులను ఎత్తి వేయాలని ఆయన డిమాండ్ చేశారు.

tags : bjp, hindu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info