A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇది కన్నా లక్ష్మీనారాయణ ఆవు కద
Share |
November 18 2018, 8:52 am

ఎపి బిజెపి నేతలు కూడా ఆవు కదలకే అలవాటు పడినట్లుగా ఉంది.బిజెపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మళ్లీ ఎపి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ, ప్రశ్నలు వేస్తూ లేఖ రాశారు.రాజధాని అమరావతి నిర్మాణానికి ఇచ్చిన నిదులను ఎపి ప్రభుత్వం పక్కదారి పట్టించలేదా అని ఆయన ప్రశ్నించారు కేంద్రం ఇచ్చిన డబ్బును దుర్వినియోగం చేసి, నిదులు ఇవ్వలేదని అసత్య ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు.వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడాన్ని ఆయన తప్పు పట్టారు.అది నయవంచనగా ఆయన అబివర్ణించారు గృహ నిర్మాణ పదకం అమలులోను అవినీతి జరిగిందని ఆయన అన్నారు.కన్నా ఎన్ని ప్రశ్నలు వేస్తే ఏమి ఉపయోగం? నిజంగానే కేంద్ర నిదులను రాష్ట్రం దుర్వినియోగం చేస్తే కేంద్రం ఇంతకాలం ఏమి చేస్తోందన్నదానికి కూడా కన్నా సమాధానం ఇవ్వాలి.లేకుంటే రోజూ ఈయన కూడా ఆవు కద చెబుతున్నారని అనుకోవాలి.

tags : kanna, cow story

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info