A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జెసి కన్నా పెద్ద దొంగ లేరు-వామపక్షాలు
Share |
November 18 2018, 8:54 am

అనంతపురం టిడిపి ఎమ్.పి జెసి దివాకరరెడ్డిపై వామపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి.కమ్యూనిస్టులను దొంగలని ఆయన విమర్శించడంపై ఆ పార్టీల నేతలు విరుచుకుపడ్డారు.జెసి ఒక మానసిక రోగి అని వారు అన్నారు.జెసి కమ్యూనిస్టులకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ‘జేసీ కన్న పెద్ద దొంగ రాష్ట్రంలో మరొకరు లేరు. ఒక బస్సుకు పర్మిషన్ తీసుకొని నాలుగు బస్సులు నడుపుతున్న దొంగ జేసీ. బినామీల పేరుతో వందల ఎకరాల భూములు కాజేసి సిమెంట్ ఘనుడు జేసీ’ అని వామపక్ష నేతలు విరుచుకుపడ్డారు.టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను వెధవలు అన్న జేసీ.. మరీ వాళ్ళకి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు ఏమవుతారో చెప్పాలని ప్రశ్నించారు. వామపక్ష నేతలు ఎక్కడ దొంగతనం చేశారో జేసీ చెప్పాలని నిలదీశారు.జెసి కల్లు తాగిన కోతి వంటివాడని కూడా వారు ఆరోపించారు.

tags : ap, jc, left

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info