A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మరో మంత్రి రాజకీయ సన్యాసం సవాల్
Share |
February 19 2019, 1:50 pm

తెలంగాణలో రాజకీయ సన్యాసం సవాళ్లు పెరుగుతున్నాయి. ఇప్పటికే మంత్రి కెటిఆర్, పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డిలు ఈ తరహా సవాళ్ళు చేసుకుంటే ,తాజాగా మంత్రి జోగు రామన్న సవాల్ విసిరారు.బిజెపి తెలంగాణ అద్యక్షుడు లక్ష్మణ్ చేస్తున్న ప్రసంగాలను ఆయన తప్పు పడుతూ,ప్రజా క్షేత్రంలో బిజెపికి పరాభవం తప్పదని అన్నారు.బిజెపి మునిగిపోయే పడవ అని ఆయన ద్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రాకుంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, అధికారంలోకి వస్తే మీరు రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని లక్ష్మణ్‌కు సవాల్‌ విసిరారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో వేలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన నీరవ్‌ మోదీ, విజయ్‌మాల్యా దర్జాగా విదేశాల్లో తిరుగుతున్నారని చెప్పారు. లక్ష్మణ్‌ ఇప్పటికైనా పగటి కలలు కనడం మానేసి, వాస్తవ పరిస్థితుల్లో జీవించాలని సూచించారు.

tags : jogu ramanna, challenge

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info