A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విభజన హామీలు-కేంద్రం, రాష్ట్రం ఆవు కదలు
Share |
April 23 2019, 3:34 am

ఎపి విభజన హామీల విషయంలో కేంద్ర ప్రభుత్వం కాని, రాష్ట్ర ప్రభుత్వం కాని ఆవు కధ చెప్పడానికి అలవాటుపడినట్లుగా కనిపిస్తున్నాయి.విభజన హామీలు దాదాపు అన్ని నెరవేర్చామని కేంద్రం చెబుతుంటే, ఏదీ నెరవేరలేదని రాష్ట్రం వాదిస్తోంది.ఇప్పుడు కేంద్రంపై సుప్రింకోర్టులో దావా వేయాలని ఎపి మంత్రివర్గం నిర్ణయించింది. ఇదంతా ప్రచారం కోసమే చేస్తున్నారా?నిజంగానే చిత్తశుద్దితో చేస్తున్నారా అన్నది చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే సరిగ్గా ఏడాది క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కేంద్రం నుంచి ఎంతో సాధించామని, తనకన్నా ఎవరు ఎక్కువ తెచ్చారో చెప్పాలని ప్రతిపక్షాలకు సవాల్ చేశారు. కాని ఇప్పుడు అదే చంద్రబాబు కేంద్రం నుంచి ఏమీ రాలేదని, చేసిన అభివృద్ది అంతా కేంద్రంతో సంబందం లేకుండా చేశామని అంటున్నారు.అది ఎలా సాధ్యమో ఆయన చెప్పరు.అందులోను చంద్రబాబు అంటే అబద్దాలకు పర్యాయపదంగా నిలిచారని విపక్షాలు వ్యాఖ్యానిస్తుంటాయి.అందువల్ల చంద్రబాబు చెప్పినవాటిని దేనిని నమ్మాలన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. నిజంగా రాష్ట్ర ప్రభుత్వపరంగా కేంద్రంపై పిటిషన్ వేస్తారా?లేక ప్రచారం కోసం వాడుకుంటారా?అన్నది కూడా సంశయమే.సుప్రింకోర్టు వారు ఈ కేసును ఎప్పటికి తీసుకుంటారో తెలియదు.అసలు ఎపి విభజన చట్టం చెల్లదని ఎప్పుడో నాలుగేళ్ల క్రితం మాజీ ఎమ్.పి ఉండవల్లి అరుణకుమార్ వేసిన పిటిషన్ కు ఇంతవరకు మోక్షం రాలేదు. కొన్ని కేసులు చకచకా వస్తాయి. మరికొన్ని కేసులు ఎందువల్లో ఏళ్ల తరబడి పెండింగులో ఉంటాయి. చంద్రబాబుకు న్యాయవ్యవస్థలో పలుకుబడి ఉందని చాలా మంది నమ్ముతారు. మరి ఇప్పుడు ఈ పిటిషన్ వచ్చేలా చేసుకోగలుగుతారో ,లేదో చెప్పలేం.అయితే ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి.కేంద్రం లక్షా ఏభై ఐదు వేల కోట్లు ఇచ్చిందని బిజెపి నేతలు చెబుతుంటారు. దానిని టిడిపి నేతలు ఖండిస్తుంటారు. నిజానికి కేంద్రం ఏ ఒక్క రాష్ట్రానికో ఒకేసారి ఒక లక్ష కోట్లు ఇచ్చేపరిస్థితి ఉండదు. సంవత్సరానికి ఇంత అని చొప్పున ఇవ్వవచ్చు. గతంలో ప్రధాని మోడీ ఎన్నికల నేపధ్యంలో ఆయా రాష్ట్రాలకు వెళ్లి వేలం పాట పాడినట్లు ప్యాకేజీలను ప్రకటించి వచ్చారు.వాటిలో చాలావరకు హామీ కాలేదని చెబుతారు.అలాంటప్పుడు ఎపికి ప్రత్యేకంగా ఎంత నిది ఇచ్చిందన్నది చర్చ అవుతుంది.అదే సమయంలో ఎపికి అసలు ఏమీ చేయలేదని ప్రతిపక్షాలు సహజంగానే విమర్శిస్తాయి. ఇంతకాలం వాటిని ఖండిస్తూ వచ్చిన అదికార తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు అదే మాట చెబుతోంది.మరి నిజం ఏమిటి?సుమారు పది వరకు జాతీయ స్థాయి విద్యాసంస్థలను ఇచ్చారు.అవి వివిధ ప్రాంతాలలో నడుస్తున్నాయి.అయితే వాటికి పదకుండువేల కోట్ల నిధులు అవసరం అయితే కేవలం వెయ్యి కోట్లే ఇచ్చారని ఎపి ప్రభుత్వం చెబుతోంది.అందులో కొంత నిజం ఉండవచ్చు.ఏ ప్రాజెక్టుకు అయినా ఒకేసారి నిదులు రావు.ఇక పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఆరువేల కోట్ల రూపాయలు ఇచ్చిందన్నది వాస్తవం. ఇక్కడ రాష్ట్రప్రభుత్వం అనండి, తెలుగుదేశం అనండి..అబద్దాలు చెబుతున్నాయి.కేంద్రం ఏమీ నిదులు ఇవ్వలేదని ప్రచారం చేస్తుంటాయి.అదేదో చంద్రబాబు సొంత నిధులు ఖర్చు చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తుంటారు.అలాగే కేంద్ర నిధులు కూడా మోడీ జేబులోనివి కావు.కాని కేంద్రం నుంచి వచ్చే నిదులను కూడా చంద్రబాబు తన ప్రచారానికే వాడుకోవడం బిజెపి నేతలకు మండుతోంది.చెట్టు నీరు,గృహ నిర్మాణం వంటి స్కీములలో కేంద్రం వాటా గణనీయంగా ఉంటుంది. మరి వాటి గురించి తెలుగుదేశం నేతలు ఎక్కడా చెప్పరు. ఈ వివాదాలు ఎలా ఉన్నా ఎక్కడ తేడా వస్తుంది.రాష్ట్రం తొలి సంవత్సరం లోటు బడ్జెట్ పదహారువేల కోట్ల నరూపాయలు కేంద్రం ఇవ్వాలని టిడిపి వాదన.అయితే అవన్ని అబద్దపు లెక్కలని,రాష్ట్రం తన ఇష్టానుసారం చేసిన హామీలకోసం చేసిన ఖర్చులను కూడా ఆ ఖాతాలో కేంద్రం నుంచి లాగాలని చూస్తోందని బిజెపి చెబుతోంది.ఒక అంచనా ప్రకారం రాష్ట్రానికి నిర్దిష్ట పార్ములా ప్రకారం ఇచ్చే నిదులు కాకుండా అదనంగా సుమారు పదిహేను వేల కోట్ల రూపాయల వరకు ఇచ్చామని కేంద్రం అనండి బిజెపి అనడం లెక్కలు చెబుతున్నాయి.అంతేకాక చంద్రబాబు అంగీకరించిన ప్యాకేజీ కింద స్పెషల్ పర్సస్ వెహికిల్ ఏర్పాటు చేసి ఉంటే విదేశీ ఆర్దిక సాయం ప్రాజెక్టుల కింద మరో పదహారువేల కోట్ల సాయం వచ్చేదని వారి వాదన.చంద్రబాబు ఈ డబ్బు తన ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయడానికి చేసిన ప్రయత్నం బెడిసినందునే ఇలా ఆరోపణలు చేస్తున్నారని బిజెపి నేతలు అంటున్నారు. అలాగే ఎపిలో అవినీతి తారాస్ధాయికి చేరిందని కూడా వీరు అంటున్నారు. ఈ లెక్కలు, హాసుప్రింమీలు ఇవన్ని సుప్రింకోర్టులో తేలతాయా అన్నది సందేహమే.అయితే షెడ్యూల్ తొమ్మిది,పది లలో ఉన్న ఆస్తుల విభజన విషయంలో అటు కేంద్రం,ఇటు ఎపి, తెలంగాణ ప్రభుత్వాలు విఫలం అయ్యాయి. వాటికి ఒక ఫార్ములాను తయారు చేయడంలో సఫలం కాలేదు. ఓటుకు నోటు కేసు కు ముందు చంద్రబాబు,కెసిఆర్ ల మధ్య వివాదాలు ఎక్కువగా ఉండేవి. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పట్టుబడిన తర్వాత ఆ కేసు కోర్టు వరకు వెళ్లకుండా చేయడంలో భాగంగా చంద్రబాబు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ వదలి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఈ ఆస్తుల విషయంలో కెసిఆర్ తో చర్చలు జరపలేకపోయారు. గవర్నర్ నరసింహన్ వీరిద్దరిని కూర్చోబెట్టాలని విశ్వయత్నం చేశారు కాని అది సాద్యపడలేదు. వీటన్నిటి చూసిన తర్వాత ఏమనిపిస్తుంది. ఎంతసేపు చంద్రబాబు నాయుడు దీనిని అంతటిని ఒక రాజకీయ క్రీడగా మార్చి ఎంత సేపు తనకు అనుకూలమా?కాదా అన్న కోణంలోనే ముందుకు వెళ్లారు తప్ప మరొకటి కాదు.కేంద్రం కూడా నాలుగేళ్లపాటు చంద్రబాబుపై ఎన్ని ఆరోపణలు వచ్చినా పట్టించుకోలేదు. ఇప్పుడు తగాదా వచ్చిన తర్వాత టైట్ చేయాలని చూస్తుంటే చంద్రబాబు దానిని తన రాజకీయ ప్రయోజానానికి వాడుకోవాలని యత్నిస్తున్నారు. ఇప్పుడు అందులో భాగంగా సుప్రింకోర్టుకు వెళ్లాలన్న ఆలోచనగా కనిపిస్తుంది. ఎన్నికల సంవత్సరంలో ఈ గిమ్మిక్కులు చంద్రబాబును కాపాడతాయా అన్నది అనుమానమే.

tags : ap, division, assurances

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info