A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పార్టీ మారిన జలీల్ ఖాన్ ఏమి మాట్లాడితే..
Share |
January 16 2019, 4:52 am

పార్టీలు మారితే మాటలు కూడా మారతాయి. గత ఎన్నికలలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి గెలిచిన జలీల్ ఖాన్ ఆ తర్వాత పార్టీ ఫిరాయించి అదికార టిడిపిలో చేరారు.ఇప్పుడు ఆయన ఏమి మాట్లాడుతున్నారో చూడండి. ఇసుక గురించి జగన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. జగన్ ను సైతాన్ అని అంటున్నాడు. తనను తాను రక్షించుకునేందుకే జగన్ పాదయాత్ర చేస్తున్నారని కూడా జలీల్ ఖాన్ తేల్చారు. పాదయాత్రకు జనం వస్తే గెలిచినట్లు కాదని కూడా ఆయన చెప్పారు.మొత్తం మీద జగన్ పాదయాత్రకు జనం వస్తున్నారని ఆయన చెప్పారు.వైఎస్ ఆర్ కాంగ్రెస్ అరవై ఏడు సీట్లు వస్తే ఏ శిక్ష కైనా సిద్దమని ఆయన అన్నారు.అన్నిటికి మించి మరో జోక్ కూడా వేశాడు. చంద్రబాబు అనుమతిస్తే, తాను కన్నా లక్ష్మీనారాయణపైన, తన కుమార్తె జగన్ పై పోటీచేయడానికి సిద్దమని జలీల్ ఖాన్ అన్నారు.ఇవన్ని ఎందుకు జలీల్ ఖాన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆ తర్వాత ఎన్ని కబుర్లు చెప్పినా బాగుంటుంది.అ పని తప్ప, పిచ్చి సవాళ్లు విసిరితే ఏమి ప్రయోజనం?

tags : jaleelkhan, party,

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info