A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పరిపూర్ణ గృహ నిర్భందం- హక్కుల ఉల్లంఘనే
Share |
April 23 2019, 3:49 am

పరిపూర్ణానంద స్వామి దర్మాగ్రహ యాత్రకు అనుమతి ఇవ్వకపోవడం ,పైగా ఆయనను గృహ నిర్భంధంలో ఉంచడంపై బిజెపి మండిపడింది. పరిపూర్ణానందను గృహ నిర్భందం చేయడం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనే అవుతుందని బిజెపి శాసనమండలి సబ్యుడు రామచంద్రరావు ఆరోపించారు. పోలీసులు ముందుగా అనుమతి ఇచ్చారని, ఆ తర్వాత గృహ నిర్భంధం చేశారని ఆయన అన్నారు.అంతేకాక ఆయనను ఇతరులు ఎవరూ కలవకుండా అడ్డుకుంటున్నారని రామచంద్రరావు ద్వజెమెత్తారు. స్వామిజీ వెంట వెళ్లే 400 మందికే రక్షణ ఇవ్వలేని ప్రభుత్వం నాలుగు కోట్ల మంది ప్రజలకు ఎలా రక్షణ ఇస్తుందని విమర్శించారు. స్వామీజి పై వేదింపులు ఆపాలని ఆయన అన్నారు.

tags : paripoorna, house arrest

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info