A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టి. ప్రభుత్వ కోరిక- సుప్రిం ఒప్పుకుంటుందా
Share |
April 23 2019, 3:56 am

బిసిల రిజర్వేషన్ ల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రింకోర్టుకు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పంచాయతీ రాజ్‌ సంస్థల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా తెలంగాణలో మొత్తం 61శాతం రిజర్వేషన్లు అమలు చేసేవిధంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన అనుమతి ఉత్తర్వులను పునరుద్ధరించాలని కోరాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అదికారులకు సూచించారు. నిర్ణయించారు. ఇందుకోసం మంత్రివర్గ ఉప సంఘం సమావేశం జరపాలని ఆయన అన్నారు. . అదనపు అడ్వకేట్‌ జనరల్‌తో పాటు ఇతర సంబంధిత అధికారులను కూడా ఈ భేటీకి పిలచి అన్ని విషయాలపై సమగ్ర చర్చ జరపాలని, తెలంగాణలో అరవై ఒక్క శాతం రిజర్వేషన్ అమలు చేయాలన్సిన అవసరంపై తమ వాదనలను బలంగా వినిపించాలని కెసిఆర్ సూచించారు.సుప్రింకోర్టు తీర్పు ఆధారంగానే హైకోర్టు ఈ నిర్ణయం చేసింది. మరి అప్పీల్ చేస్తే సుప్రింకోర్టు నిర్ణయం మారుతుందా?

tags : telangana,supreme court

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info