A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పరిపూర్ణానంద బహిష్కరణ- బిజెపి ఆగ్రహం
Share |
January 16 2019, 4:38 am

పరిపూర్ణానంద స్వామీజిని హైదరాబాద్ నుంచి బహిష్కరించడంపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది.దీనిపై బిజెపి ప్రధాన కార్యదర్శి మురళీధరరావు ట్విటర్ లో స్పందిస్తూ
నిజాం మత రాజకీయాలకు కేసీఆర్‌ ప్రభుత్వ పరిపాలన నిదర్శనమని ధ్వజమెత్తారు. పరిపూర్ణానంద బహిష్కరణ మానవహక్కుల ఉల్లంఘన అని విమర్శించారు. ఇది యూవత్‌ హిందూ సమాజంపై దాడి అని, ప్రభుత్వం ఓటు బ్యాంక్‌ రాజకీయాలకు పెద్దపీఠ వేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అర్థరాత్రి నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు.
కాగా పరిపర్ణానంద స్వామిని హైదరాబాద్‌ నుంచి బహిష్కరించడాన్ని నిరసిస్తూ కరీంనగర్‌లో బీజేపీ ధర్నా చేపట్టింది. స్వామిపై వేసిన బహిష్కరణను వెంటనే ఉపసంహరించుకోవాలని బీజేపీ అధికార ప్రతినిధి బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ధర్నాలో పాల్గొన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

tags : muralidharrao, paripoorna

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info