A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పరిపూర్ణానంద కాకినాడ తరలింపు
Share |
April 23 2019, 3:34 am

ఓ వర్గాన్ని రెచ్చగొట్టేవిధంగా మాట్లాడారన్న ఆరోపణలతో పరిపూర్ణానందస్వామిని హైదరాబాద్ నుంచి బహిష్కరించారు తెలంగాణ పోలీసులు. స్వామీజీని ఆశ్వారావుపేట మీదుగా కాకినాడలోని శ్రీపీఠంనకు తరలించారు. భద్రాచలం శ్రీరాముని సన్నిధిలో వదిలేయాలని స్వామీజీని కోరినా పట్టించుకోలేదు. స్వామీజీని నగరబహిష్కరణ చేయడాన్ని నిరసిస్తూ ఇవాళ విహెచ్పీ, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నారు. అయితే స్వామీజీ ఆరునెలల తర్వాత హైదరాబాద్ లో ప్రవేశించడంపై కూడా ఆంక్షలు కూడిన అనుమతులు ఇవ్వబోతున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు అనుమతితోనే హైదరాబాద్ లో అడుగుపెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

tags : paripurnananda swami,hyd

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info