A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఒకేసారి ఎన్నికలపై టిడిపి మాట మార్చిన వైనమిలా
Share |
September 19 2018, 4:54 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,తెలుగుదేశం పార్టీ దేశంలో అసెంబ్లీ,లోక్ సభ ఎన్నికలు ఒకేసారి జరగాలన్న ప్రతిపాదనపై మాట మార్చిన తీరుపై సోషల్ మీడియాలో విస్తారంగా ప్రచారం జరుగుతోంది.తెలుగుదేశం కు మద్దతు ఇచ్చే మీడియాలో మినహా మిగిలిన మీడియా అంతా చంద్రబాబు ఏడాది క్రితం జమిలి ఎన్నికలపై ఏమి అన్నారో, ఇప్పుడు ఏమి అంటున్నారో వివరిస్తూ వ్యంగ్య వ్యాఖ్యానాలు చేస్తున్నాయి. చంద్రబాబును 2017 ఏప్రిల్ లో, 2017 అక్టోబర్ లో ఒకేసారి దేశంలో ఎన్నికలు జరగాలన్న వాదనను చాలా గట్టిగా వినిపించారు.కాని బిజెపితో చెడిన తర్వాత పూర్తిగా యూటర్న్ తీసుకోవడం విశేషం.

అక్టోబర్ 2017 లో చంద్రబాబు ఇలా అన్నారు..

మొదటి నుంచి నేను ఒకేసారి ఎన్నికలు జరగడాన్నే కోరుకున్నాను. లోక్‌సభకు, అసెంబ్లీకి, స్థానిక సంస్థలకు కూడా ఒకేసారి ఎన్నికలు జరగాలి. ఆరు నెలల్లోపు, లేదా గరిష్టంగా 9 నెలల్లోపు ఈ ప్రక్రియ ముగియాలి. మిగిలిన సమయంలో పాలనపై దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది’ అని పేర్కొన్నారు. ఎన్నికల వ్యయం, అవినీతిని తగ్గించడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారా? అనే మరో ప్రశ్నకు జవాబుగా ‘మనం సమయం ఆదా చేయొచ్చు..అవినీతిని అరికట్టవచ్చు’ అని పేర్కొన్నారు.

టీడీపీ ఎంపీలు ఈ నెల ఎనిమిదిన లా కమిషన్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీలను అస్థిరపరిచేందుకే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అందులో భాగమే జమిలి ఎన్నికల ఎత్తుగడ అని ఆరోపించారు. జమిలి ఎన్నికల యోచనను తాము వ్యతిరేకిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణ ఖర్చు చూపి జమిలి ఎన్నికలు నిర్వహించడం సరికాదన్నారు. తెలుగుదేశం పార్టీ ఇలా మాట మార్చడంపై పలు విమర్శలు వస్తున్నాయి. ముందస్తు ఎన్నికలకు తెలుగుదేశం భయపడుతోందని కొందరు అబిప్రాయపడుతున్నారు.

చంద్రబాబు అబిప్రాయాలు ఎలా మారాయో ఈ ప్రకటనలు తెలియచేస్తున్నాయి.

దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదనను నేను స్వాగతిస్తున్నాను. మూడు నెలలకు, ఆరు నెలలకు ఎన్నికలు ఏమిటి? ‘ఒక దేశం– ఒక ఎన్నిక ’ అంటూ ప్రధాని మోదీ చేసిన ప్రతిపాదనను నేను బలపరుస్తున్నాను.
– 2017, ఏప్రిల్‌ 27న సచివాలయంలో మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు

లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని నేను మొదటి నుంచి కోరుకుంటున్నాను. ఒకేసారి అన్ని ఎన్నికలు అయిపోతే మిగిలిన సమయమంతా ప్రభుత్వ విధానాల రూపకల్పన, వాటి అమలుపై పూర్తిగా దృష్టి సారించడానికి అవకాశం ఉంటుంది. అభివృద్ధికి ఇది మంచిది.
– 2017 అక్టోబర్‌ 5న ఒక ఆంగ్ల టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు

పార్లమెంటుకు, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం కుదరదు. రాష్ట్రాల అసెంబ్లీ కాలపరిమితి ముగియకముందే పార్లమెంటుతోపాటు శాసనసభ ఎన్నికలు కూడా నిర్వహించాలనడం రాజ్యాంగ విరుద్ధం. దీనికి టీడీపీ వ్యతిరేకం.
– చంద్రబాబు ఆదేశాలపై లా కమిషన్‌కు 2018 జూలై ఎనిమిదిన తెలుగుదేశం తరపున టీడీపీ ఎంపీలు ఇచ్చిన లేఖ సారాంశం

tags : chandrababu, tdp, elections

Latest News
*తొక్కిసలాట- జడ్జి పై వైసిపి తీవ్ర విమర్శ
*జసి దివాకరరెడ్డి అబద్దాలు చెబుతున్నారా
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమ్మ…లోకేషా!
*రోడ్డు మీద నాట్లు వేసిన రోజా
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info