A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సల్మాన్ కు మరోసారి నోటీసులు
Share |
February 19 2019, 8:19 am

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మరోమారు చిక్కుల్లో పడ్డాడు. పన్వెల్‌లోని తన ఫామ్ హౌస్‌లో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సల్మాన్‌కు మహారాష్ట్ర అటవీశాఖ నోటీసులు జారీ చేసింది. అటవీశాఖ నోటీసులకు 9రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. పన్వెల్‌ కు చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అటవీశాఖ అధికారులు సల్మాన్ తండ్రి పేరుపై నోటీసులు పంపారు. అయితే చట్టపరమైన విధివిధానాలు పూర్తి చేసిన తర్వాతే నిర్మాణ పనులు ప్రారంభించినట్టు సల్మాన్ స్పష్టం చేశారు. న్యాయపరమైన విషయాలు తన న్యాయవాది చూసుకుంటారని, చట్టపరంగా తాము ఎదుర్కోంటామని పేర్కొన్నారు.

tags : salman khan,forest dept

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info