A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాళేశ్వరం- చంద్రబాబు,కాంగ్రెస్ లపై హరీష్ వ్యాఖ్య
Share |
July 23 2018, 11:13 am

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ నేతలు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు అడ్డుకునే యత్నాలు చేస్తున్నారని మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఇందుకోసం వారు చేయని ప్రయత్నాలు లేవని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఆపాల్సిందిగా చంద్రబాబు ఢిల్లీకి పదేపదే లేఖలు రాస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజల నోటికాడ ముద్ద లాగేసేం దుకు మూకుమ్మడిగా ప్రయత్నిస్తూ ప్రాజెక్టును పద్మవ్యూహంలో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ 2007లో ప్రాణహిత–చేవెళ్లను ప్రారంభించి 8 ఏళ్లపాటు ప్రాజెక్టు కోసం ఏ అనుమతి సాధించకపోగా మొబిలైజేషన్, సర్వే పేరుతో రూ.2,400 కోట్లు దోచేసిందని హరీశ్‌రావు ఆరోపించారు. తమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ 2008లో లేఖ రాసినా కాంగ్రెస్‌ పట్టించుకోలేదన్నారు. అప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో, మహారాష్ట్రలో అధికారంలో ఉన్నా ఎవరూ దీనిపై స్పందించలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక మార్చిన డిజైన్‌ను సీడబ్ల్యూసీ ప్రశంసించిందన్నారు. ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును పరిశీలించాలని సీడబ్ల్యూసీ ఇంజనీర్లను కూడా పంపిందన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక తాము అతితక్కువ కాలంలో ప్రాజెక్టు అనుమతులన్నీ సాధించగలిగామన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిని కలిసిన తర్వాత హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. అయితే బిజెపి నేతలను మాత్రం ఆయన విమర్శించినట్లు లేరు.

tags : harish rao, kaleswaram

Latest News
*చంద్రబాబు ఇంతకీ ఎవరికి ధన్యవాదాలు చెప్పారు
*కెసిఆర్ వాళ్ల ఉచ్చులో పడకుండా తప్పుకున్నారా
*కాంగ్రెస్ ,టిడిపి ల మద్య సీట్ల సంఖ్యపై చర్చ?
*బంగారం ఎమ్మెల్యేలు ..ఇత్తడి ఎమ్మెల్యేలు అయ్యారా
*రేవంత్ కు ఆ బాద్యత అప్పగించారట..
*మమత సైతం అనైతిక ఫిరాయింపుల్ని ..
*దగ్గుబాటి రాజకీయ పోరం పెడతారా
*ఇప్పుడే నిద్రలేచి నట్లు టిడిపి నాటకాలు
* బోర్డు తిప్పేయడంలో చంద్రబాబు నిపుణుడు
*లతా మంగేష్కర్ బిజెపికి ప్రచారం చేస్తారా
*వైసిపి ఎమ్మెల్యే హౌస్ అరెస్టు
*ముందుగా బాబు,లోకేష్ లను చూస్తే గాని కేబుల్ టివీ..
*ఆ స్టేట్ మెంట్ లకు అడ్డుకట్ట వేసిన సి.ఎమ్.
*కెటిఆర్ నోట బూతు మాట!
*మోడీ మెచ్చుకోలు-టిఆర్ఎస్ కు బూస్ట్
*పార్లమెంటులో మోడీ ప్రశంస-కెటిఆర్ కామెంట్
*బిజెపి నేతలు కూడా స్క్రీన్ లపై బాబు మాటలు
*చంద్రబాబు అదులో సీనియరే..
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info