A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఒకేసారి ఎన్నికలు- వైసిపి ఒకే
Share |
January 16 2019, 5:14 am

దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగాలన్న ప్రతిపాదనను వైఎస్ ఆర్ కాంగ్రస్ సమర్దించింది. దేశంలో లోక్ సభ ,అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగితే ప్రజా ధనం వృధా కాకుండా ఉంటుందని భావిస్తున్నట్లు లా కమిషన్ కు పార్టీ అబిప్రాయంగా తెలిపింది. ఎమ్.పి విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు లా కమిషన్ కు ఈ మేరకు తమ అభిప్రాయం తెలిపారు.ఉమ్మడి ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌కు కొత్తేమి కాదని అన్నారు. 2004 నుంచి 2014 వరకూ ఏపీలో ఎన్నికలు అలానే జరుగుతూ వస్తున్నాయని చెప్పారు. జమిలి ఎన్నికలను వైఎస్సార్‌ సీపీ సమర్ధిస్తోందని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే ఖర్చు, అవినీతి బాగా తగ్గుతుందని, అప్పుడే ఓటుకు కోట్లు లాంటి కేసులు పునరావృతం కావని వారు అన్నారు.ఒక వేళ ప్రభుత్వాలు పడిపోతే ఏమి చేస్తారని ప్రశ్నించామని, మిగిలిన కాలానికే ఎన్నికలు జరుగుతాయని కమిషన్ చైర్మన్ తెలిపారని వారు వివరించారు.

tags : elections, ysr congress

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info