A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపిని పవన్ గెలిపించలేదట- టిడిపి వ్యాఖ్య
Share |
November 13 2018, 11:56 am

జనసేన అదినేత పవన్ కళ్యాణ్ భ్రమలలో ఉన్నారని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఆ పార్టీ నేత, మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని తానే గెలిపించానన్న భ్రమలలో పవన్ కళ్యాణ్ ఉన్నారని వ్యాఖ్యానించారు.బిజెపి మాటలనే పవన్ కళ్యాణ్ కూడా చెబుతున్నారని ఆయన ఆరోపించారు.అవాస్తవాలను పవన్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తేల్చిన నిధుల లెక్కపై పవన్ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని గంటా నిలదీశారు. రైల్వేజోన్, ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ ఇలా ప్రతి అంశంలోనూ తెలుగుదేశాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్న పవన్... మోదీ, అమిత్ షాను ప్రశ్నించడానికి మాత్రం సాహసం చేయలేకపోతున్నారని గంటా అన్నారు. బిజెపికి పవన్ కళ్యాణ్ భయపడుతున్నారని గంటా అనడం ఆశ్చర్యంగానే ఉంది. ఎందుకు బిజెపికి పవన్ భయపడాలబ్బా!

tags : ganta, pawankalyan

Latest News
*కోదాడలో టిడిపి తిరుగుబాటు
*జానారెడ్డి వాదన అంతా డిఫెన్స్ లో ఉన్నట్లు లేదూ!
*చంద్రబాబుపై ఇవన్ని తిట్లేనట....టిడిపి ఫిర్యాదు
*తెలంగాణ పట్టణాల పేర్లు మార్చుతారట
*చైతన్య, నారాయణలకు తాకట్టు
*ఖమ్మం నుంచి టిడిపి అభ్యర్ధి నామా
*ఎన్నికల అదికారులపై కాంగ్రెస్ ఆరోపణ
*కోమటిరెడ్డి సోదరుల పట్టు నిలిచింది
*65 మందికాంగ్రెస అభ్యర్దుల తొలి జాబితా ఇది
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info