A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిక్కెట్లు ఇచ్చేది లోకేష్ అయితే మరింత ఈజీనట
Share |
April 23 2019, 3:24 am

తెలుగుదేశం పార్టీ తరపున కర్నూలు లోక్ సభకు బుట్టారేణుక, కర్నూలు సిటీకి ఎస్వీమోహన్ రెడ్డిలే పోటీ చేస్తారని, వారిని భారీ మెజార్టీతో గెలిపించాలని నిన్న ఆ జిల్లాలో పర్యటించిన మంత్రి నారాలోకేష్ పిలుపునిచ్చారు. లోకేష్ వ్యాఖ్యలపై ఆ పార్టీలోనే కొందరు అసంతృప్తి నేతలు గుర్రుమంటున్నారు. అసలు సీట్లు ఖరారు చేసే బాధ్యత లోకేషే తీసుకున్నారా..పార్టీపై ఇక పూర్తి పట్టు లోకేషే తీసుకున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయని టిడిపి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు చేతుల్లో సిఎం పదవి మినహా పెద్దగా అధికారాలు లేవన్న అభిప్రాయంతో లోకేష్ ప్రకటన ఉందని అంటున్నారు. టిడిపిలో ఎంత ఏకతాటిపైన ఉన్న నియోజకవర్గాల్లోనూ ఇలా చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించలేదని అంటున్నారు. మొత్తానికి పార్టీ బాధ్యతలు లోకేష్ తీసుకుంటే తమ పని మరింత సులువు అవుతుందని వైసిపినేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

tags : lokesh,kurnool

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info