A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెఎస్ ఆర్ లైవ్ షో రికార్డు
Share |
September 19 2018, 2:49 pm

కెఎస్ ఆర్ లైవ్ షో ఒక రికార్డు సృష్టించింది.సాక్షిలో ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా రెండేళ్లు పూర్తి చేసుకుంది. టీవీలలో సాదారణంగా సీరియల్స్ కు సైతం బ్రేక్ ఉంటుంది. కాని కెసిఆర్ లైవ్ షోని రెండేళ్ల పాటు నడపగలిగినందుకు సంతోషంగా ఉంది.బహుశా దేశంలోనే ఇది ఒక రికార్డు కావచ్చు. తెలుగులో అయితే కచ్చితంగా రికార్డే, ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి షోలు చాలా జరుగుతుంటాయి. అయితే బ్రేక్ లేకుండా ఒక వ్యక్తి ఆద్వర్యంలో నడవడం అరుదైన విషయం.ఇందుకు ఎంతో మంది సహకరించారు. సాక్షి మీడియా గ్రూప్ చైర్ పర్సన్ వైఎస్ భారతీగారు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి దన్యవాదాలు తెలియ చేసుకుంటున్నాను. అలాగే డైరెక్టర్ లు శ్రీరామచంద్రమూర్తి, వైఇపి రెడ్డి, మేనేజింగ్ ఎడిటర్ భాస్కర్,ఇంతకు ముందు ఎడిటర్ గా పనిచేసిన గోపీనాద్ రెడ్డి, అవుట్ పుట్ ఎడిటర్ శ్రీనాద్, కోఆర్డినేటర్లు సూర్యనారాయణ, శ్రీనివాసరెడ్డి తదితరులు ఎందరో ఈ కార్యక్రమం నిరాఘాటంగా సాగడానికి సహకరించారు. టీవీలో ఏ కార్యక్రమం అయినా సమష్టి కృషితోనే చయవలసి ఉంటుంది. ఇందుకోసం టీవీలోని ఆయా విభాగాల వారు ఎంతగానో సహకరించారు. అలాగే సీనియర్ పాత్రికేయులు, రాజకీయ నేతలు, సామాజిక కార్యకర్తలు,ప్రజా సంఘాల వారు అంతా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు కృతజ్ఞతలు. అన్నిటిని మించి నిత్యం కెఎస్ ఆర్ లైవ్ షో ని చూస్తూ ప్రోత్సహిస్తుందుకు ప్రేక్షక మహాశయులకు కోటి దండాలు.2007లో న్యూస్ స్కాన్ పేరుతో టివి 5 లో ఆరంబించడం జరిగింది. ఆ తర్వాత 2009 నుంచి ఎన్.టి.విలో కె ఎస్ ఆర్ లైవ్ గా 2016 వరకు పడిపాము. 2016 లో సాక్షిలో అదే పేరుతో ఆరంభించి రెండేళ్ల పది రోజులు అవడం ,అందులో కూడా ఒక్క రోజు కూడా ఆబ్సెంట్ కాకుండా శనివారం నాటికి రెండేళ్ల పాటు నడపగలగడం సంతోషంగా ఉంది. ఒక వ్యక్తి పేరు మీద ఇలా షో లు తొమ్మిదేళ్లకు పైగా నడుస్తుండడం కూడా అరుదే కావచ్చు. ఇందుకు అవకాశం ఇచ్చినవారందరికి, షో ని చూస్తూ ప్రోత్సహిస్తున్న అందరికి మరోసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

కొమ్మినేని శ్రీనివాసరావు
కెఎస్ ఆర్ లైవ్ షో..


ఇంతకు ముందు పొరపాటున కెసిఆర్ లైవ్ షో అని ప్రచురితమైంది.పొరపాటును మన్నించగలరు.దానిసి సరిచేస్తూ కెఎస్ ఆర్ లైవ్ షో గా మళ్లీ పోస్టు పెట్టడం జరిగింది.

tags : ksr live show, record

Latest News
*జసి దివాకరరెడ్డి అబద్దాలు చెబుతున్నారా
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమ్మ…లోకేషా!
*రోడ్డు మీద నాట్లు వేసిన రోజా
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info