A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి మట్టి కొట్టుకుపోతుందన్న కన్నా
Share |
August 22 2018, 8:45 am

చంద్రబాబు అబద్దాలు ఆడుతున్నారని, ఆ విషయాన్ని ప్రజలు గ్రహించిన రోజున ఎపిలో తెలుగుదేశం పార్టీ మట్టి కొట్టుకు పోతుందని బిజెపి ఎపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.డిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.కడప స్టీల్ ప్లాంట్ పై అదికారులు తమ నివేదికను ఇస్తే, బిజెపి అద్యక్షుడు అమిత్ షా ప్రధానిని ఒప్పించి ఒక టాస్క్ పోర్స్ ను ఏర్పాటు చేయించారని, ఒక కన్సల్టెన్సీకి కూడా బాద్యతలు అప్పగిస్తే ఇంతవరకు ఎపి ఎపి ప్రబుత్వం వారితో సమావేశం కాలేదని ఆయన అన్నారు. తన అవినీతి కోసం చంద్రబాబు రాష్ట్ర అబివృద్దిని పణంగా పెట్టారని ఆయన అన్నారు.ప్రతిదానిని కేంద్రం పై నెట్టేసి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలని చంద్రబాబు యత్నిస్తున్నారని కన్నా ఆరోపించారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారని, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి పుట్టగతులు ఉండవని ఆయన అన్నారు.

tags : kanna, bjp, tdp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info