A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపికి చంద్రబాబు వెన్నుపోటు
Share |
June 25 2018, 12:08 am

భారతీయ జనతాపార్టీని వదలి పెట్టి వెళ్లడం వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబుకే నష్టమని బిజెపి అద్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారని సమాచారం.చంద్రబాబు ఎలా వ్యవహరించినా, ఎపిని అబివృద్ది చేయడం బజిపి లక్ష్యమని ఆయన అన్నారు. ఎన్డీఏ నుంచి చంద్రబాబు ఎందుకు బయటికి వెళ్లారో ఆయనకే తెలియాలని, దానివల్ల ఆయనకే నష్టం కానీ బీజేపీకి కాదని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో కన్నాతో పాటు పార్టీ నేతలు పురంధేశ్వరి, జీవీఎల్‌ నరసింహారావు, విష్ణుకుమార్‌రాజు, ఆకుల సత్యనారాయణ తదితరులు అమిత్‌ షాతో సమావేశం అయ్యారు.
బీజేపీకి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని అమిత్‌ షాకు చెప్పానన్నారు. అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు నిజం గ్రహించిన రోజు టీడీపీ మట్టిగొట్టుకుపోతుందని ఆయన అన్నారు.

tags : kanna, bjp,tdp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info