A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో ప్రజలతోనే కాంగ్రెస్ పొత్తు-చాందీ
Share |
October 19 2018, 11:09 pm

ఎపిలో ఎవరితో పొత్తు పెట్టుకోబోమని ఎఐసిసి ప్రదాన కార్యదర్శి, ఎపి వ్యవహారాల ఇన్ చార్జీ ఊమెన్ చాంది చెప్పారు. తాము ఏ పార్టీతో అవగాహనకు రావడం లేదని, ప్రజలతోనే పొత్తు పెట్టుకుంటామని ఆయన అన్నారు. ఎపిలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఇది కష్టసాద్యమైనదని తెలుసునని, అయినా ప్రజల వద్దకు వెళతామని, వారితోనే ఉంటామని ఆయన అన్నారు. ఇంటింటికి కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్లి వాస్తవ పరిస్తితి వివరించే యత్నం చేస్తారని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా తదితర అంశాలను బిజెపి విస్మరించిందని ఆయన అన్నారు. అదే సమయంలో టిడిపి నాలుగేళ్లు బిజెపితో కలిసి ఉండి,ఇప్పుడు ప్రజలను తప్పు దారి పట్టించే యత్నం చేస్తోందని చాందీ అన్నారు.

tags : congress, ap, public,alliance

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info