A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హైదరాబాద్ ప్రజలకు క్లాస్ పీకిన మంత్రి
Share |
August 22 2018, 8:46 am

గ్రేటర్ హైదరాబాద్ నగర ప్రజలకు మున్సిపల్ మంత్రి కెటిఆర్ క్లాస్ పీకారు, హైదరాబాద్ లోని నాలాలలో ఇష్టం వచ్చినట్లు వ్యర్ధ పదార్దాలను ప్రజలు పడేస్తున్నారని,దాంతో అవన్ని పూడి పోతున్నాయని, ప్రజలు కూడా బాద్యత లేకుండా వ్యవహరిస్తే ఎంత మంది అదికారులు ఉన్నా ఏమి చేయగలుగుతారని ఆయన ప్రశ్నించారు. ఎమ్.పి మల్లారెడ్డి 300 కోట్ల నిది ఇవ్వాలని అడిగారని, ఎంత నిది అయినా ఇవ్వవచ్చని, కాని ఉపయోగం ఉండాలి కదా అని ఆయన అన్నారు. ఈ మద్య నాలాలను పూడిక తీసే కార్యక్రమం చేపడితే అందులోనుంచి ప్లాస్టిక్ బాటిళ్లు, పరుపులు,దుప్పట్లు ,ఇలా ఎన్నో వస్తువులు బయటపడ్డాయని, వీటి వల్ల మురుగు ప్రవాహానికి ఎంత ఆటంకం అన్నది ప్రజలు గమనించాలని అన్నారు. ఎన్నికోట్లు ఖర్చు చేసినా, ప్రజలు సహకరించకపోతే, అదికారులు ఏమి చేయగలుగుతారని ఆయన ప్రశ్నించారు.

tags : ktr, hyderabad, class

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info