A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అడ్డొస్తే కేసులు పెట్టండి-మంత్రి కెటిఆర్
Share |
January 17 2019, 4:54 pm

హైద‌రాబాద్ న‌గ‌రంలో నాలాల పూడిక ప‌నులు మ‌రింత ముమ్మ‌రం చేయ‌డంతో పాటు పురాత‌న శిథిల భ‌వ‌నాలు, నాలాల‌పై అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను వెంట‌నే తొల‌గించాల‌ని రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ మంత్రి కె.టి.రామారావు జీహెచ్ఎంసీ అధికారుల‌ను ఆదేశించారు. న‌గ‌రంలో రోడ్డు నిర్మాణ పనులు, నాలాల పూడిక ప‌నులు, శిథిల భ‌వ‌నాల తొల‌గింపు, జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ డంప్‌యార్డ్ క్యాపింగ్ ప‌నుల‌పై జీహెచ్ఎంసీ కార్యాల‌యంలో మంత్రి కె.టి.రామారావు జీహెచ్ఎంసీ, జ‌ల‌మండ‌లి, హైద‌రాబాద్ రోడ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్‌, ట్రాఫిక్ త‌దిత‌ర శాఖ‌ల ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, రాష్ట్ర ప్ర‌భుత్వ మున్సిప‌ల్ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి అర్వింద్‌కుమార్‌, డిప్యూటి మేయ‌ర్ బాబా ఫ‌సియుద్దీన్‌, క‌మిష‌న‌ర్ జ‌నార్థ‌న్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్న ఈ స‌మావేశంలో మంత్రి కె.టి.రామారావు మాట్లాడుతూ రుతుప‌వ‌నాల ప్ర‌భావంతో
ఇప్ప‌టికే న‌గ‌రంలో వ‌ర్షాలు ప్రారంభం అయినందున నాలాల్లో పూడిక ప‌నులు మ‌రింత వేగ‌వంతం చేయాల‌ని అన్నారు. నాలాల‌పై అక్ర‌మ నిర్మాణాలు, శిథిల భ‌వ‌నాల తొలగింపులో ఏవిధ‌మైన అల‌స‌త్వం వ‌హించ‌వ‌ద్ద‌ని, ఈ విష‌యంలో ఎవ‌రు అడ్డం వ‌చ్చినా త‌గు కేసులు న‌మోదు చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. శిథిల భ‌వ‌నాలు, నాలాలు, చెరువులపై అక్ర‌మ నిర్మాణాల తొల‌గింపు పురోగ‌తి నిరుత్సాహ‌క‌రంగా ఉంద‌ని, ఈ విష‌యంలో మ‌రింత క‌ఠినంగా,దూకుడుగా వెళ్లాల‌ని టౌన్‌ప్లానింగ్
అధికారుల‌ను ఆదేశించారు. అక్ర‌మ నిర్మాణాల తొల‌గింపులో టౌన్‌ప్లానింగ్‌, విజిలెన్స్ విభాగాలు
స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని మంత్రి పేర్కొన్నారు. అక్ర‌మ నిర్మాణాలను ప్రాథ‌మిక స్థాయిలోనే
అడ్డుకోవాల‌ని, ఒక సారి నిర్మిత‌మైతే వాటిని తొల‌గించేందుకు స‌మ‌స్య‌గా మారుతుంద‌ని అన్నారు.

tags : ktr, cases

Latest News
*కెసిఆర్ కు 36 వంటలతో బాబు విందు ఇచ్చారే
*చంద్రబాబుకు తలసాని ఘాటు జవాబు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*తలసానిని కలిసిన టిడిపి నేతలు ఎవరో
*మోడీకోసమే పెడరల్ ప్రంట్-టిడిపి ఆరోపణ
*ఒడిషా లో కాంగ్రెస్ కు షాక్
*న్యాయ వ్యవస్థలో మళ్లీ లొల్లి
*జగన్ నవరత్నాలు..చంద్రబాబు భయపడుతున్నారా
*యుపిలో మా గ్రాప్ ఇంకా పెరుగుతుంది
*కెసిఆర్ ను ఎపికి బాబు ఎందుకు పిలిచారు
*మరో సారి మోడీ-బిజెపి నినాదం
*ఎపిలో అసలు ప్రభుత్వం ఉందా
*దర్శి నుంచి వైసిపి అభ్యర్ది ఈయనేనా
*పెడరల్ ప్రంట్ పనే చర్చ-పొత్తు ప్రసక్తి లేదు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*ఒమర్ అబ్దుల్లా ఇల్లు-ఆకర్షతుడైన కెటిఆర్
*తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం
*మే ప్రభుత్వం గండం నుంచి బయటపడింది
*అమిత్ షా కు స్వైన్ ప్లూ
*స్రైవేటు విద్యా సంస్థలలో రిజర్వేషన్ లు
*భార్యాభర్తలు ఇద్దరూ లోక్ సభకు పోటీ
*24వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
*ఫెడరల్ ప్రంట్ తరపున ప్రచారం -విజయసాయి
*కూటమి నుంచి ఎదుకు బయటకు వచ్చానంటే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info