A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణకు పుడ్ టెక్నాలజీ సంస్త సహకారం
Share |
August 21 2018, 11:29 am

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యాన పంటల ఉత్పత్తుల నుండి వ్యాల్యు ఆడెడ్ ప్రోడక్ట్స్ తయారుచేసి మరింత విలువను జోడించడానికి అవసరమైన సాంకేతిక పరిజ్జనాన్ని అందించి, తెలంగాణ రాష్ట్రంతో కలిసి పనిచేయడానికి సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రిసెర్చ్ ఇనిస్ట్యూట్ (CFTRI) అంగీకారం తెలిపింది.ఈరోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పొచారం శ్రీనివాస రెడ్డి నేత్రుత్వంలోని బృందం మైసూర్ లోని CFTRI కేంద్ర కార్యాలయాన్ని సందర్శించింది. రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో ఒక ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయాడానికి మంత్రి పొచారం నేతృత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏర్పాటు
చేశారు. వ్యవసాయ, ఉద్యాన పంటల నుండి బైప్రోడక్ట్స్ తయారుచేయడంలో పేరెన్నికగన్న సంస్థ CFTRI.ఒక్కరోజు పర్యటనలో బాగంగా మైసూర్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన రాష్ట్ర బృందం పలు ఉత్పత్తులలో తయారి, నిల్వ, మార్కెట్ లో అవకాశాలను పరిశీలించింది.
ముందుగా CFTRI కార్యాలయానికి చేరుకున్న రాష్ట్ర బృందానికి CFTRI అధికారులు కన్నడ సంప్రధాయ పద్దతులలో ఘనంగా స్వాగతం పలికారు. తదనంతరం మొదట పైలెట్ ప్లాంట్ ను సందర్శించిన బృందం అక్కడ దోశ, చపాతి, ఇడ్లీ ని యంత్రాల ద్వారా తయారు చెసే విధానాన్ని పరిశీలించారు. వేరుశనగ విత్తనాలను వేయించే, ప్యాకింగ్ చెసే యంత్రం ప్రత్యేకతను అధికారులు వివరించారు. మొక్కజొన్న నుండి బిస్కెట్లు, కుకీస్, పౌడర్ వంటి ఉత్పత్పుల తయారు, ప్యాకింగ్ ను పరిశీలించారు.పసుపు ప్రాసెసింగ్ టెక్నాలజీపై రాష్ట్ర బృందం అధిక ఆసక్తిని కనబరిచింది. పసుపు నుండి వంట కోసం వాడే పౌడర్ తో పాటు పారిశ్రామిక అవసరాల కోసం కర్కుమిన్, పోలేయారెజిన్ వంటి ఉప ఉత్పత్తులను తయారు
చేయడం వలన రైతులకు అధిక లాభాలు వస్తాయని CFTRI అధికారులు వివరించారు. మాములు పద్దతులలో పసుపును పౌడరుగా మార్చడానికి 45 రోజుల సమయం అవసరం అవుతుండగా CFTRI అభివృద్ధి చేసిన టెక్నాలజితో కేవలం ఎనిమిది (8) గంటలలోనే పౌడరుగా మార్చవచ్చు.
....

tags : ochacram, food technology

Latest News
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info