A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పంచాయతీ ఎన్నికలు- ఎమ్మెల్యేలకు హడల్
Share |
March 23 2019, 10:36 am

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలంటే ఎమ్మెల్యేలు హడలెత్తుతున్నారట. తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్న సంగతి తెలిసిందే. అందుకు ఏర్పాట్లు కూడా సాగుతున్నాయి. అదే సమయంలో టిఆర్ఎస్ నాయకత్వం పంచాయతీ ఎన్నికలలో అయ్యే ఖర్చు అంతటిని ఎమ్మెల్యేలు భరించాలని స్పష్టం చేసిందట. దాంతో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల గొంతులో వెలక్కాయపడ్డట్లయిందని చెబతుఉన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోను సుమారు వంద వరకు పంచాయతీలు ఉంటాయని, వాటన్నిటిలో టిఆర్ఎస్ ను గెలిపించుకోవాల్సిన బాద్యత తమపై ఉంటుందని, అంటే డబ్బు ఖర్చు కూడా తామే పెట్టవలసి ఉంటుందని,దానికి కోటి నుంచి కోటిన్నర వరకు ఖర్చు అవుతుందని భయపడుతున్నారు.పైగా వచ్చే ఏడాది ఏప్రిల్ లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. అప్పుడు నాలుగైదు కోట్ల రూపయాలకు సిద్దం కావల్సి ఉంటుందని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ పంచాయతీ ఎన్నికలు తమకు కొత్త తలనొప్పి తెచ్చి పెడుతున్నాయని వారు వాపోతున్నారు.

tags : telangana, panchayat elections

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info