A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబును చిత్తుగా ఓడించాలి
Share |
May 24 2019, 4:15 am

కాపులను అడుగడుగునా మోసం చేయడమే కాకుండా అవమానిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తుచి్త్తుగా ఓడిపోవాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాబం అన్నారు. కాపు బిల్లును మొక్కుబడిగా కేంద్రానికి పంపారని, అందులో సరైన సమాచారం లేదని కేంద్రం వెనక్కి పంపడం నిజం కాదా అని చంద్రబాబును ముద్రగడ ప్రశ్నించారు.బిజెపితో తగాదా వచ్చాక మా బిల్లును మొక్కుబడిగా కేంద్రానికి పంపారంటూ మండిపడ్డారు. ప్రస్తుతం రాజస్తాన్‌, గుజరాత్‌​, హరియాణా తరహాలో కాకుండా గతంలో ఉన్న రిజర్వేషన్లనే కాపులు అడుగుతున్నారని ఈ సందర్భంగా కాపు ఉద్యమనేత గుర్తుచేశారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు పార్టీని చిత్తుగా ఓడించాలపి ఆచప అన్నారు. 2019 ఎన్నికలకు నాలుగు నెలల ముందు మా రిజర్వేషన్లపై సృష్టత ఎవరు యిస్తారో, అప్పుడు మా కాపు జాతితో పాటు ఇతర సామాజిక వర్గాల పెద్దలతో చర్చించి తదుపరి కార్యచరణ ప్రకటిస్తామని’ ముద్రగడ చెప్పారు.

tags : mudragada, babu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info