A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
డిల్లీలో రాజ్ భవన్ లో సి.ఎమ్. ఆందోళన
Share |
May 24 2019, 4:19 am

దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా డిల్లీ లెప్టినెంట్ గవర్నర్ బైజల్ నివాసమైన రాజ్ భవన్ వద్ద ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మంత్రులు దర్నా రెండో రోజు కూడా కొనసాగించారు. అక్కడ ఉండే వెయిటింగ్ హాలులో వారంతా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇంతవరకు లెప్టినెంట్ గవర్నర్ వారిని పిలిచి మాట్లాడకపోవడం విశేషం. కాగా తాజాగా ఇద్దరు మంత్రులు ఆమరణ దీక్షకు దిగారు.ఇదంతా డిల్లీ ప్రజల కోసమే చేస్తున్నామని కేజ్రీవాల్ చెప్పారు.ఐఎఎస్ అదికారుల సమ్మె పరిష్కారం కోసం వారంతా ఆందోళను దిగారు. ఎల్‌జీ ఆదేశాల మేరకే అధికారులు పనిచేయడం మానుకున్నారని, దీంతో ప్రభుత్వ కార్యకలాపాలు, ముఖ్యంగా రేషన్, గుడిసెవాసులకు ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన వంటి ప్రజోపయోగ పనులు నిలిచిపోయాయని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. దీనిపై మోడీ ప్రభుత్వం శ్రద్ద పెట్టకపోతే ఇదంతా వారికి అప్రతిష్టగా మారుతుంది.

tags : kejriwal, delhi

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info