A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోలవరానికి కేంద్రం నిదులు ఇచ్చేసింది
Share |
June 25 2018, 12:25 am

పోలవరం ప్రాజెక్టుకు సంబందించి కేంద్రం తాజాగా 1400 కోట్ల రూపాయలు విడుదల చేసిందని, దీంతో ఆ ప్రాజెక్టుపై కేంద్రం ఒక్క పైసా కూడా బాకీ లేదని బిజెపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. అయినా తెలుగుదేశం నేతలు బిజెపిపైన, కేంద్రంపైన దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.టీడీపీ అంటే తెలుగుదేశం సంస్కార హీనుల పార్టీ అని లక్ష్మీనారాయణ తీవ్రంగా విమర్శించారు. తాము ధర్నా చేస్తే దానికి పోటీగా టీడీపీ నాయకులు ధర్నా చేశారని మండిపడ్డారు. ప్రతిపక్షం అంటే టీడీపీ నాయకులకు విలువే లేదని వ్యాఖ్యానించారు.
‘రాజకీయ పక్షాలంటే గౌరవం లేదు. రాష్ట్రాన్ని దోచుకుతిని టీడీపీ నాయకులకు కళ్లు కనబడటం లేదు. వైఎస్సార్‌ సీపీకి, జనసేనకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టేనని టీడీపీ ప్రచారం మొదలెట్టింది.ఆయన ద్వజమెత్తారు.

tags : kanna, polavaram

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info