A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ అంటే ఎవరెస్టు అంత గౌరవం వచ్చింది
Share |
December 15 2018, 4:25 pm

వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అదినేత జగన్ పట్ల తన గౌరవం పెరిగిందని,ఎవరెస్టు మాదిరి ఆయన ఉన్నతంగా ఆలోచిస్తున్నారని ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి అన్నారు.అందుకు నిదర్శనంగా తన అనుభవాన్ని ఆయన వివరించారు.గత ఎన్నికల్లో జగన్‌ మోహన్‌రెడ్డి రైతు రుణ మాఫీ చేస్తానని హామీ ఇస్తే ఎన్నికల్లో గెలిచే వారన్నారు. ఇటీవల పాదయాత్రలో జగన్‌ను కలిసి ఈ విషయం ప్రస్తావించినపుడు ఆచరణ సాధ్యంకాని హామీలను ఇవ్వనని.. ప్రజలకేది చెబితే అదే అమలు చేస్తానని, రైతులను ఎట్టి పరిస్థితు ల్లోనూ మోసం చేయబోనని జగన్‌ స్పష్టం చేశారన్నారు. రుణమాఫీకి మించి రైతులకు మంచి ప్యాకేజీ ఇస్తానని చెప్పిన జగన్‌పై తనకున్న గ్రేటెస్ట్‌ ఫీలింగ్‌ ఎవరెస్ట్‌ స్థాయికి చేరిందన్నారు. ప్రజలను ప్రేమించి.. వారి కష్టసుఖాలను తెలుసుకునేందుకు వారి వద్దకు వెళుతోన్న గొప్ప నాయకుడు జగన్‌ అన్నారు. చంద్రబాబు ఆడుతోన్న అబద్ధాలు, మోసాలను జగన్‌ ప్రజల్లో చెబుతున్నారని.. బాబుపై ఎలాంటి నిందలు వేయడం లేదని స్పష్టం చేశారు. బాబు మాత్రం జగన్‌ను అన రాని మాటలు అంటున్నాడన్నారు.తన ఓటు జగన్ కేనని ఆయన స్పష్టం చేశారు.

tags : posani, jagan

Latest News