A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పునాది గోడల్ని జాతికి అంకితం చేస్తారా- జగన్ ప్రశ్న
Share |
December 15 2018, 5:00 pm

గత నాలుగేళ్లుగా ఎపిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు అబద్దాల సినిమాలు చూపిస్తున్నారని విపక్ష నేత జగన్ అన్నారు. రాజమండ్రిలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఒకటి అమరావతి కాగా, రెండోది పోలవరం అని ఆయన అన్నారు. అమరావతి సింగపూర్ అని, మరొకటి అని సినిమా చూపిస్తున్నారని ,కాని నాలుగేళ్లుగా శాశ్వత ప్రాతిపదికన ఒక్క ఇటుక పడలేదని ఆయన అన్నారు. అమరావతి సినిమాలో ఏవేవో జరిగిపోతున్నట్లు చూపిస్తారని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఇంకా పునాది దశలోనే ఉందని అన్నారు. డయాఫ్రమ్ వాల్ అంటే పునాది గోడ అయిందని చెప్పి జాతికి అంకితం చేస్తున్నానని అంటున్నారని జగన్ విమర్శించారు. 36 లక్షల క్యూటిక్ మీటర్ల మేర పని జరగవలసి ఉన్నా, ఇంతవరకు ఆరేడు లక్షల క్యూబిక్ మీటర్లే జరిగిందని అన్నారు. ఏభై శాతం పనులు పూర్తి అయిందని చంద్రబాబు అంటున్నారని, అందులో వైఎస్ హయాంలో కుడి,ఎడమ కాల్వలకు చెందిన డెబ్బై శాతం పనులు జరిగాయని ఆయన అన్నారు. పునాది గోడల్ని జాతికి అంకితం చేయడం చూస్తే,ఒక ఇంటికి ఆరుసార్లు శంకుస్థానపలు చేసినట్లుగా ఉందని, ఇల్లు పునాదిలో ఉండగానే, గృహప్రవేశం చేసినట్లుగా ఉందని అన్నారు. చంద్రబాబు మోసం చేయడంలో పిహెచ్ డి తీసుకున్నారని జగన్ అన్నారు.పోలవరం తన కల అని చంద్రబాబు చెబతున్నారని, మరి 1995 -2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నడైనా పోలవరం గురించి పట్టించుకోలేదని జగన్ ప్రశ్నించారు.గతంలో వడ్డి వీరభద్రరావు ఎన్నిసార్లు పోలవరం గురించి చంద్రబాబు ను అడిగారో గుర్తుకు తెచ్చుకోవాలని, ఆ తర్వాత ఆయన మూడువేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారని జగన్ గుర్తు చేశారు.

tags : jagan, polavram

Latest News
*చంద్రబాబులా అభాసుపాలు కాం
*ప్రజా కూటమిని తెలంగాణ రుద్దే యత్నం చేశారు
*టిఆర్ఎస్ వందేళ్ల భవిష్యత్తుకు ప్లాన్-కెటిఆర్
*రుణమాఫీ మంచిది కాదున్న ప్రముఖ/డు
*లోక్ సభ ఎన్నికలు- డిమాండ్ తగ్గిన కాంగ్రెస్
*సుప్రిం తీర్పు-దొంగలెవరో తేలింది
*టిడిపి పెద్ద డ్రామా కంపెనీ అన్న బిజెపి
*అబద్దాలు చెప్పడంలో ఆయనను మించినవారు ..
*ఆ ముఖ్యమంత్రికి చిక్కులు వస్తాయా
*ఈవిఎమ్ లపై కాంగ్రెస్ డిల్లీలో పోరాటం
*జడ్జి రాజీనామా , ఉపసంహరణ
*ఇక మమత ప్రంట్-కెసిఆర్ హాపి..మరి బాబు!
*టిడిపి మీడియాకు కెటిఆర్ కౌంటర్ ఇచ్చారు
*కోడెల ఎందుకు ఇలా చేస్తున్నరు?
*కేంద్రంలో ఎవరికి సొంతంగా పవర్ రాదు
*కాంగ్రెస్,టిఆర్ఎస్ ల మధ్య 48 లక్షల ఓట్ల తేడా
*ఎపిలో కాంగ్రెస్ తో పొత్తు ఉండదన్న టిడిపి ఎమ్ఎల్యే
*రజత్ కుమార్ పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణ
*నందమూరి కుటుంబం మరోసారి మోసపోయింది
*కెసిఆర్ ,టిడిపి- అప్పుడే యుటర్న్ - కామెంట్
*చంద్రబాబు యాంటి సెంటిమెంట్..మాకూ దెబ్బ..
*ఎపికి 15.7 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే..
*కుటుంబరావుకు నిరాశ కలిగిందట
*ఎపిలో ఓట్ల గోల్ మాల్- కాల్ సెంటర్ తీర్చేనా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info