A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కోడెల ప్రవర్తన- అపచారం కాదా- విశ్లేషణ
Share |
March 23 2019, 9:56 am

ప్రజాస్వామ్య వ్యవస్థలో స్పీకర్ స్థానానికి ఒక ఔన్నత్యం ఉంటుంది. స్పీకర్ కు ఒక వ్యక్తిత్వం ఉంటుంది.ఒకసారి స్పీకర్ పదవిలోకి వచ్చాక రాజకీయాలకు అతీతంగా వ్యవహరించడం సంప్రదాయంగా ఉంటుంది.నీలం సంజీవరెడ్డి వంటి గొప్ప నేతలు స్పీకర్ అయ్యాక తాము ప్రాతినిద్యం వహించిన పార్టీకే రాజీనామా చేసి సత్సంప్రదాయాన్ని నెలకొల్పారు. స్పీకర్ గా ఉంటూ ఎన్నికల ప్రచారం చేయడమా అని సందేహించిన అయ్యదేవర కాళేశ్వరరావు పంతులు వంటివారు ఆంద్రప్రదేశ్ లో ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిందేనని శాసనసభలో పట్టుబట్టి తన స్పీకర్ పదవికి రాజీనామా చేసిన బివి సుబ్బారెడ్డి వంటి నేతల చరిత్ర మన ఎదుట కనిపిస్తుంది.ఎంతో శక్తిమంతుడుగా పేరొందిన ఎన్.టి.ఆర్.ను సైతం అవసరమతే సభలో నిలువరించిన స్పీకర్ నారాయణరావు వ్యక్తిత్వం కనిపిస్తుంది.కాని దురదృష్టవశాత్తు అలాంటి సదాచారాలు, విలువలు పోయి, ఇప్పుడు స్పీకర్లు విలువలను తుంగలో తొక్కి అదికార పార్టీ సభలలో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఆయా అంశాలలో పక్షపాతంగా ఉంటున్నారన్న విమర్శను ఎదుర్కుంటున్న స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరో అడుగు మందుకు వేశారు. మీడియాలో వచ్చిన ఒక వార్త చూస్తే ఆశ్చర్యం వేసింది. కోడెల ఏకంగా విపక్ష నేత జగన్ ను వైఎస్ ఆర్ కాంగ్రెస్ ను తీవ్రంగా విమర్శించి రాజకీయ ఉపన్యాసం చేసి స్పీకర్ స్థానానికి ఉన్న గౌరవాన్ని పూర్తిగా దిగజార్చడం దురదృష్టకరం.నరసరావుపేటలో జరిగిన నవనిర్మాణ దీక్ష సబలో ఆయన ప్రసంగించిన వార్త చదివిన తర్వాత ఆయనపై కామెంట్ రాయాలన్న అబిప్రాయం కలిగింది.ఆయన కూడా స్పీకర్ గా కాకుండా ఆంద్రులలో ఒకడిగా పోరాటం చేస్తున్నారట. ముఖ్యమంత్రి చంద్రబాబును పొగుడుకుంటే పెద్దగా అబ్యంతరం లేదు. కాని ప్రదాని మోడీని, విపక్ష నేత జగన్ ను నిందించడం ఆశ్చర్యంగానే ఉంటుంది.గతంలో ఎన్.టి.ఆర్. ప్రభుత్వాన్ని కూల్చినప్పుడు తెలుగువారి సత్తా చూపించారని, అలాంటి పరిస్తితే మోడీకి కూడా ఎదురవుతుందని ఆయన తేల్చారు. అయితే చంద్రబాబు ఆద్వర్యంలో కోడెల తదితరులంతా కలిసి ఎన్ .టి.ఆర్.ను కూలదోసిన విషయం గురించి ఈయన చెప్పి ఉండాల్సింది.రాష్ట్రంలో అదికార పార్టీ కేంద్రంపై పోరాడుతుంటే ప్రతిపక్ష పార్టీ కేంద్రంతో లాలూచి పడుతోందని కూడా ఆయన అన్నారు. కేసుల కోసం కేంద్రంతో లాలూచీ పడుతున్నారట.ఇలాంటి పిచ్చి మాటలు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి,ఇతర టిడిపి నేతల నుంచి వినలేక చస్తుంటే ఇప్పుడు స్పీకర్ కోడెల కూడాఅలాగే తయారవడం ఆంద్రుల దౌర్భాగ్యం అనుకోవాలి. మరి నాలుగేళ్లు చంద్రబాబు బిజెపితో ఎందుకు లాలూచీ పడ్డారో కోడెల సెలవివ్వాలికదా..అంతా దాక ఎందుకు ఇరవై మూడు మంది వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరి చంద్రబాబు కొనడమే కాకుండా వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇస్తే కోడెల ఎందుకు లాలూచీ పడ్డారో కూడా వివరించాలి కదా..రాజ్యాంగ విలువలను కాపాడవలసిన కోడెలే వలువలు ఊడదీసినట్లు ఒక్కరిపై కూడా అనర్హత వేటు వేయకుండా దుర్మార్గాన్ని ఎందుకు రక్షిస్తున్నారు.చంద్రబాబు,కోడెల దుర్మార్గానికి, రాజ్యాంగాన్ని అపహస్యం చేసినందుకు నిరసనగా మొత్తం ప్రతిపక్షమే బాయ్ కాట్ చేస్తే అది వారికి సిగ్గుగా అనిపించదా?ప్రజలు చీదరించుకుంటారన్న ఇంగిత జ్ఞానం ఉండదా?ప్రత్యేక హోదాపై శాసనసబలోనే చంద్రబాబు ఎన్నిసార్లు మాట మార్చింది..కోడెలకు గుర్తు లేదా? నిజమే ఆయన తెలుగుదేశం నేతే కావచ్చు.కాని రాజ్యాంగం స్పీకర్ లకు ఒక సమున్నత స్థానం కల్పించింది. దానిని నిలబెట్టవలసిన బాద్యత ఆ పదవిలో ఉన్నవారిపై ఉంటుంది.గతంలో స్పీకర్ లు గా పనిచేసిన సురేష్ రెడ్డి కాని, నాదెండ్ల మనోహర్ వంటి వారు సైతం ఎక్కడా ఇలాంటి రాజకీయ కార్యకాలపాలలో పాల్గొని పదవి పరువు తీయలేదు. అంతదాకా ఎందుకు తెలంగాణ స్పీకర్ మదుసూదనాచారి ఎమ్మెల్యేల పిరాయింపుల కేసులలో చర్య తీసుకోకుండా తప్పు చేసినా, కోడెల మాదిరి మరీ దిగజారి రాజకీయ ఉపన్యాసాలు చేయడం, టిఆర్ఎస్ సభలలో పాల్గొనడం వంటివి చేయడం లేదు.కోడెల ఎంతో సీనియర్ నేత, ఆయన వయసుకు, అనుభవానికి తగినట్లు హుందాగా ఉంటే ఆయనకు మంచి పేరు వచ్చేది.కాకి అలా కాకుండా చంద్రబాబు చేతిలో పావు మాదిరి గా మారిపోతే ఆయనకే నష్టం వాటిల్లుతుంది. స్పీకర్ స్థానంలో ఉన్నవారు భవిష్యత్తులో ఆచరించే విధంగా గొప్ప సంప్రదాయాలు సృష్టించాలి.కాని దురదృష్టవశాత్తు కోడెల తన ఆత్మ గౌరవాన్ని వదలుకుని దుష్ట సంప్రదాయాలు తెరదీస్తున్నారు.ఆంద్రులందరికి ఇది అవమానమే కాదు..తెలుగుజాతికే అపచారం అని చెప్పక తప్పదు.

tags : kodela, critisam

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info