A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో సింగపూర్ మంత్రుల హడావుడి- ఒక విశ్లేషణ
Share |
March 23 2019, 10:41 am

ఒక విషయం మాత్రం అంగీకరించాలి.ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సింగపూర్ దేశ మంత్రులు ఒకరిద్దరితో మంచి సంబంధాలే ఉన్నాయి. వారిలో ఈశ్వరన్ ముఖ్యంగా కనిపిస్తుంటారు.వారిని కూడా తన రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకోగలుగుతున్నారు. వారు తరచుగా అమరావతి కి వస్తుంటారు. ఏవేవో ఒప్పందాలు చేసుకుంటారు. వాటిలో ఏది వాస్తవమో,ఏది అవాస్తవమో తెలియకుండా పరిస్థితి ఏర్పడుతోంది. ఈ మద్యకాలంలో ఆంద్రప్రదేశ్ లో రియల్ ఎస్టేట్ దారుణంగా దెబ్బతింది.హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పుంజుకుని మందుకు వెళుతుంటే ,మంచి ఊపు మీద ఉండాల్సిన అమరావతి చతికిల పడింది.విభజన తర్వాత చంద్రబాబును,ఆయన చెప్పే సింగపూర్ కబుర్లు నమ్మిన పలువురు విజయవాడ పరిసరాలలో పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టారు. వారిలో ముందస్తు సమచారం సంపాదించుకున్న తెలుగుదేశం తమ్ముళ్లు సరిగ్గా ఎక్కడ కొనాలో అక్కడ కొన్నారు. ప్రబుత్వ,అటవీ భూములు అదికంగా ఉన్న ప్రాంతంలో ఎవరైనా రాజదాని పెడతారులే..అది కామన్ సెన్స్ కదా అనుకున్నవారు బోల్తా పడ్డారు. నూజివీడు వైపు పెట్టుబడి దారుణంగా దెబ్బతిన్నారు.పచ్చగా ఉండే,మూడు పంటలు పండే భూములను చంద్రబాబు ఎంపిక చేసుకుని అక్కడ బూ సమీకరణ అని ,భాగస్వమ్య అబివృద్ది అని నమ్మించి రైతుల నుంచి బూములు తీసుకున్నారు.ఆ క్రమంలో కొంతమంది దళారులు లాభపడ్డారు. కాని తదుపరి కొన్నవాళ్లు మాత్రం అటు చెప్పుకోలేక, ఇటు ఏమనలేక కిందమీద పడుతున్నారు. రాజధాని స్థలం ఎంపిక తర్వాత ఒక్కసారి ఆ చుట్టుపక్కల ధరలు బాగా పెరిగిన మాట వాస్తవం.అంతకుముందు కూడా విజయవాడ,గుంటూరు పరిసరాలలో భూముల రేట్లు గణనీయంగానే ఉండేవి. కాని రాజదాని ప్రకటన తర్వాత ఆ ముప్పై,నలభై గ్రామాలు మినహాయించి మిగిలిన ప్రాంతాలలో ధరలు తగ్గిపోయాయి.ఉదాహరణకు ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని చంద్రబాబు విజయవాడకు రావడానికి ముందు కృష్ణా జిల్లాలో కొన్ని చోట్ల ఎకరా మూడు కోట్లు కూడా ధర పలికిన భూములు ఆ తర్వాత కోటి రూపాయల దరకు పడిపోయాయి. అది కూడా అడిగేవారు తక్కువే అయ్యారు.ఇలాంటి పరిస్థితి రాజధాని చుట్టుపక్కలే కాకుండా,ఇప్పుడు రాజదాని గ్రామాలలో కూడా కొంతవరకు ఏర్పడిందని చెబుతున్నారు. దీనికి కారణం చంద్రబాబు నాయుడు ఇన్ని వేల ఎకరాలు సేకరించి తనే రియల్ ఎస్టేట్ వెంచర్ ను ఆరంబించడం. దానిని సజావుగా ముందుకు తీసుకు వళ్లలేకపోవడమే. మరో ఏడాదిలో ఎన్నికలు వస్తున్న తరుణంలో చంద్రబాబులో ఇప్పుడు గుబులు ఏర్పడింది. మిగిలిన ప్రాంతాలలో అంతా అమరావతేనా అంటూ పెదవి విరిస్తుంటే, గుంటూరు ,కృష్ణా జిల్లాలలో మొత్తం దరలు పడిపోయి ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నవారు కూడా గణనీయంగానే పెరిగారు.దీంతో అప్పడప్పుడు సింగపూర్ కంపెనీలనో, అక్కడి మంత్రులనో పట్టుకు వచ్చి హడావుడి చేస్తున్నారన్న అనుమానం వస్తుంది.తద్వారా ఏదో చేస్తున్నారన్న భావనతో రియల్ ఎస్టేట్ పెరుగుతుందని వారి ఆశ కావచ్చు. అదే సమయంలో సింగపూర్ కంపెనీలతో కలిసి కొత్త కంఎపీనీ ఏర్పాటు చేయడం ,సుమారు ఐదువేల కోట్లతో మనం ఖర్చు చేసి రోడ్లు, తదితర సదుపాయాలు కల్పించడం, ఆ తర్వాత ప్లాట్లు వేసి అమ్ముకునే పనిని ఆ కంపెనీకి అప్పగించడం,అందులో అదిక వాటాను సింగపూర్ కు రాసివ్వడం, ఏమైనా తగాదా వస్తే సింగపూర్ కోర్టులోనే తేల్చుకోవాలని వారు షరతు పెడితే చంద్రబాబు అంగీకరించడం వంటివి చూస్తే ఎన్నో సందేహాలకు ఆస్కారం ఇస్తుంది. ఎపి లోని కొందరు సీనియర్ అదికారులే ఇది అది పెద్ద స్కామ్ అవుతుందని అంటున్నారట.పైగా ఈ మాత్రం రియల్ ఎస్టేట్ బాగోతానికి భారతీయ కంపెనీలు చేయలేవా? హైదరాబాద్ లో భారతీయ కంపెనీలు ఎంత పెద్ద భవనాలు నిర్మిస్తున్నాయో చూడడం లేదా?నిజానికి మరో పది నెలల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రబుత్వాలు ఇలంటి ఒప్పందాలు చేసుకోవడం సరికాదు. పైగా సింగపూర్ కంపెనీలతో కలిసి చేస్తున్నది రాజదాని నిర్మాణం కాదు. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం. అయినా ఫర్వాలేదు. ఆ ఒప్పందాలు పారదర్శకండా ఉంటే ఒప్పుకోవచ్చు.అలాగే ప్రభుత్వ దనం వేల కోట్లు ఖర్చుచేసి మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాత అదిక వాటాను సింగపూర్ కు ఇవ్వవలసిన అవసరం ఉంటుందా?అన్నది చర్చనీయాంశం.ఎకరా భూమిని ఇరవై లక్షల రూపాయలకు ఇచ్చి , ఆ తర్వాత నాలుగు కోట్లకు అమ్మాలని అనడం ఏమిటో అర్దం కాదు. అదే సమయంలో ఇక్కడ కంపెనీలకు ఏభై లక్షల నుంచి రెండు కోట్ల వరకు ఎందుకు అమ్మారో తెలియదు. సింగపూర్ కు అన్ని అదికారాలు ఇచ్చిన తర్వాత ఏదైనా తేడా వస్తే ఎపి ప్రభుత్వం ఏమి చేయగలుగుతుంది?2014 ఎన్నికలలో సింగపూర్ ను తలదన్నే రాజదానిని నిర్మిస్తానని చంద్రబాబు అంటే , డిల్లీని మించిన రాజధాని అని మోడీ అన్నారు. వీరిద్దరూ ఎన్నికల కోసం జనాన్ని మోసం చేయడానికి అన్నారా?లేక తెలివి తక్కువగా అన్నారా అన్నది అర్దం కాదు.2018 నాటికి రాజదాని మొదటి దశ పూర్తి అవుతుందని ప్రచారం చేసిన చంద్రబాబు ఆ ఊసు ఎత్తకుండా 2020 అని తాజాగా చెబుతున్నారు. వేల కోట్ల రూపాయల ప్రజాదనంతో అమరావతి అనే ఆటను చంద్రబాబు ఆడుకుంటున్నారు. ఆ ఆటలో తన సరదా కోసం సింగపూర్ వారిని కూడా తెచ్చుకుంటున్నట్లుగా ఉంది.మరి ఇంతకాలంగా సింగపూర్ కంపెనీలకు ఎపి మీద అంత ప్రేమ ఉంటే ఎక్కడో చోట ప్రభుత్వ భూములు తీసుకుని అబివృద్ది చేసి చూపించి ఉండవచ్చుకదా..అలా ఎందుకు చేయలేదంటే,వారి వ్యాపారం వారిది కనుక.సింగపూర్ కంపెనీలతో చైనా అంతటి దేశమే చేదు అనుభవం ఎదుర్కుంది. చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే సింగపూర్ ఒప్పందం రహస్యాలను,దాని మంచి చెడులను ,ప్రజలకు వస్తున్న సందేహాలను నివృత్తి చేయాలి. వచ్చే ఎన్నికలలో సింగపూర్ తో కలిసి ఈ పని చేస్తాను అని దైర్యంగా చెప్పి ఎన్నికలకు వెళ్లి,ఒక వేళ గెలిస్తే ఆ తర్వాత ఈ ప్రాజెక్టును ఆరంభిస్తే ఆయనకే మంచిది. ఆ పరిస్థితి కనిపించడం లేదు.ఆయన ఏది నిజం చెప్పరన్న భావన ప్రబలింది.ఈ మొత్తం ప్రక్రియలో కేంద్రం ఏమి చేస్తుందో తెలియదు. బిజెపి నేతలు మాత్రం విమర్శిస్తుంటారు.కేంద్రం చోద్యం చూస్తుంటుంది. చంద్రబాబు నాయుడు ఎపి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ లక్షల కో్ట్లను వృదా చేస్తున్నారన్న విమర్శను ఎదుర్కుంటున్నారు. ఇప్పటికే ఆయన పాలనపై ఏభై ఏడు శాతం మంది విరక్తి చెందారని టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది. చంద్రబాబు ఇదే తరహాలో ముందుకు వెళితే అది మరింత పెరిగి వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీని పూర్తిగా చీత్కరించే పరిస్థితి ఏర్పడుతుంది. మరి అది కావాలో,లేక ఇప్పటికైనా నిజాయితీగా వ్యవహరించి ప్రజలకు వాస్తవాలు చెప్పాలా?అన్నది చంద్రబాబే నిర్ణయించుకోవాలి.

tags : ap, singapore

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info