A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇదేం పని ...మాజీ సి.ఎమ్ గారూ
Share |
June 25 2018, 12:30 am

సుప్రింకోర్టు ఆదేశాల మేరకు యుపి మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ లక్నోలోని ప్రభుత్వ బంగళాను ఖాళీ చేశారుకాని ,బంగ్లాను బాగా డామేజీ చేసి వెళ్లారట. శుక్రవారం రాత్రి ఆయన మనుషులు ఎస్టేట్ అదికారులకు బంగళా తాళం అందచేశారు. శనివారం ఉదయం ఒక సీనియర్ అదికారి బంగళాను సందర్శించారు.కాని ఆయన తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారట.బంగళా అంతటిని చిందరవందర చేశారట.ఈ బంగళాను అఖిలేష్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నలభై ఐదు కోట్లతో ఆదునీకరించారు. ఆ సమయంలో వేసిన సైకిల్ ట్రాక్ ను ఇప్పుడు తవ్వేశారట.ట్రాక్ లో ఉన్న విదేశీ ఇటుకలను తరలించుకుపోయారట.స్విమ్మింగ్ పూల్ లోని మార్బుల్ , అలాగే కొన్ని గదులలో ఉన్న ఇటాలియన్ మార్బుల్ తీసుకుపోయారు.ఎసిలు, తలుపులు తదితర వస్తువులను కూడా తరలించుకుపోయారు.దీనిపై అకిలేష్ కు నోటీసు ఇవ్వాలని న్యాయ నిపుణులతో సంప్రదిస్తామని అదికారులు చెబుతున్నారు.అయితే అఖిలేష్ ఇదంతా బిజెపి కావాలని చేస్తున్న ప్రచారం అని, తన ప్రతిష్టను దెబ్బతీసే యత్నమని అన్నారు. తన కు చెందిన మొక్కలు అక్కడ వదిలివేశానని అంటున్నారు.

tags : akhilesh, bunglaw

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info