A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో బిజెపికి ఒక్క సీటు రాదంటున్న సిపిఐ
Share |
August 21 2018, 11:30 am

ఎపిలో బిజెపి కి ఒక్క సీటు కూడా రాదని సిపిఐ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్రత్యేక హోదాపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బిజెపి ఎపి నేతలు కేంద్రానికి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారని, విబజన హామీలు చాలా నెరవేర్చారని చెబుతున్నారని ఆయన అన్నారు.
విభజన హామీల్లో ఏం నెరవేర్చారో చెప్పాలని సవాల్ చేస్తున్నాం. వెనుకబడిన జిల్లాలకు బుందేల ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని అన్నారు. రాజధాని నిర్మాణానికి కేవలం పదిహేను వందల కోట్ల నిధులు ఇచ్చి, దానికి కూడా యూసీలు ఇవ్వలేదని అంటున్నారని ఆయన అన్నారు. సిగ్గులేకుండా బీజేపీ నాయకులు కేంద్రాన్ని సమర్ధిస్తున్నారని అన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని కింది స్థాయి వరకు తీసుకు వెళ్లబోతున్నాం అని హెచ్చరించారు. రాష్ట్రంలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు. ప్రధాని నరేంద్ర మోదీ గ్రాఫ్ ప్రజల్లో పడిపోతోంద’ని రామకృష్ణ చెప్పారు. ఇది బాగానే ఉంది కాని బిజెపికి ఇప్పుడు ఉన్నవే నాలుగు అసెంబ్లీ సీట్లు, రెండు లోక్ సభ సీట్లు.అవి వచ్చినా,రాకపోయినా పెద్దగా తేడా రాదు. విశేషం ఏమిటంటే సిపిఐకి కాని,సిపిఎం కు కాని ఒక్క సీటు కూడా లేదు.మరి ఈసారైనా అసెంబ్లీలోకి వస్తాయా?

tags : ramakrishna, bjp, cpi

Latest News
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info