A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సామూహిక రాజీనామా?
Share |
March 23 2019, 9:52 am

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ లకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చినా వారి సభ్యత్వాలను పునరుద్దరించనందుకు నిరససగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమం తీవ్రం చేయాలని, అంతిమంగా సామూహిక రాజీనామాలు చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో బాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కలిసి స్పీకర్ మదుసూదనచారిని కలవబబోతున్నారు.ఆ తర్వాత సుప్రింకోర్టుకు వెళ్లాలని యోచిస్తున్నారు.. ప్రత్యేకంగా సభలు నిర్వహించడం, బస్సుయాత్రలో నిర్వహించే సభల్లోనూ నొక్కి వక్కాణించడం ద్వారా ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని యోచిస్తున్నారు.ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ ప్రజల్లోకి వెళ్లాలని.. ఖమ్మం, అలంపూర్‌లలో బహిరంగసభలు నిర్వహించాలని నిర్ణయించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే పార్టీలో చర్చ జరుగుతున్న విధంగా మూకుమ్మడి రాజీనామాలకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సిద్దం కావాలని కొందరు సూచిస్తున్నారు.

tags : congress, resignations

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info